కరోనా వైరస్ .. ప్రస్తుతం ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తునం మహమ్మారి. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచంలోని ప్రతి దేశం అల్లాడిపోతోంది. ఇక మన దేశంలో కూడా కరోనా మహమ్మారి రోజురోజుకి వేగంగా విస్తరిస్తుంది. మన దేశంలో మొదట కరోనా ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ కూడా .. ఢిల్లీ మర్కజ్ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దీనితో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిసి లాక్ డౌన్ ను అమలులోకి తీసుకువచ్చాయి.
ఇకపోతే , ఈ కరోనా భారిన పడిన ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు అక్కడి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తున్నాయి. అయితే , ప్రాణాంతక కరోనా వైరస్ బాధితులకు పంజాబ్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. కరోనా లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన వారి ఖర్చును ప్రభుత్వం భరించదని స్పష్టం చేసింది. ఎవరి ఖర్చులు వారే భరించుకోవాలని అమరీందర్ సింగ్ సర్కారు స్పష్టం చేసింది. ఇకపోతే మంగళవారం నాటికి పంజాబ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 256కు చేరింది.
కాగా, రాష్ట్రంలో దశలవారీగా మద్యం అమ్మకాలు జరిపేందుకు అనుమతినివ్వాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్రాన్ని కోరారు. అదే విధంగా కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రానికి 3 వేల కోట్ల రూపాయలు విడుదల చేసేలా చొరవ తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మధ్యంతర పరిహారంతో పాటు బకాయి పడిన జీఎస్టీ రూ. 4400 కోట్లు వెంటనే విడుదల చేయండి. కరోనాపై పోరులో రాష్ట్రాలకు ఆర్థికంగా అండగా నిలబడాల్సిన ఆవశ్యకత ఉంది’’అని అమరీందర్ సింగ్ లేఖలో పొందుపరిచారు.