ఆ నటిని సెక్స్ స్కాంలో ఇరికించి.. ఆ హీరో కూతుర్ని స్టార్ ను చేశారట

Update: 2022-05-06 13:30 GMT
బాలీవుడ్ నటి ఒకరు చేసిన షాకింగ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమె చేసిన ఆరోపణలు కొత్త ప్రకంపలకు కారణమైంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. బిగ్ బాస్ ఫేమ్ పూజా మిశ్రా. తన కెరీర్ ను సీనియర్ అగ్ర నటుడు ఒకరు సర్వనాశనం చేశాడని.. అతడి కుమార్తెను స్టార్ చేసుకోవటం కోసం తన జీవితాన్ని బలి ఇచ్చినట్లుగా వాపోయింది. ఇప్పుడీ వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి.

ఇంతకీ ఆమె ఆరోపణలు చేసింది మరెవరో కాదు.. సీనియర్ రాజకీయ నేత.. షాట్ గన్ గా సుపరిచితుడు ప్రస్తుతం టీఎంసీ నేతగా వ్యవహరిస్తున్న శత్రుఘ్న సిన్హా. ఇంతకీ ఈ పూజా మిశ్ర ఎవరు? ఆమె శత్రుఘ్నసిన్హా మీద ఎందుకు ఆరోపణలు చేసింది? ఆమె చెప్పే దాన్లో లాజిక్ అసలుందా? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి. వీడియో జాకీగా.. మోడల్ గా మాత్రమే కాదు.. కొన్ని సినిమాల్లోనూ ఆమె నటించింది. ఆమె చేసే ఆరోపణ ఏమంటే.. తన కెరీర్ ను పణంగా పెట్టి.. శత్రుఘ్న సిన్హా తన కుమార్తె సోనాక్షి సిన్హాను హీరోయిన్ చేశారంటున్నారు.

తన తండ్రి శత్రుఘ్న సిన్హాకు కోట్లాది రూపాయిల్ని సాయంగా ఇచ్చారని.. వారి కుటుంబంతో తమకు పదిహేడేళ్లకు పైనే అనుబంధం ఉందని పేర్కొంది. తాను 2007 నుంచి 2014 వరకు లోఖండ్ వాలాలోని ఫ్యామిలీ అపార్ట్ మెంట్ లోనే తాను ఉన్నట్లు చెప్పారు. సిన్హా కుటుంబం తామున్న పోర్షన్ పైన ఉండేవారన్నారు. ఒకసారి తాను శత్రుఘ్న సిన్హాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని వారింటికి వెళ్లినట్లు చెప్పారు.

‘‘అప్పుడు ఆయన భార్య నాకు చేతబడి చేసిన ఫుడ్ పెట్టి.. తినిపించారు. అలా నా శరీరం నా కంట్రోల్ లో లేని సమయంలో సెక్స్ స్కాంలో పాల్గొనేలా చేశారు. నా కన్యత్వాన్ని అమ్మి ష్యాషన్ డిజైనర్ కావాలనుకున్న తమ కుమార్తె సోనాక్షిని స్టార్ చేశారు.  నేను సింగపూర్ కు షాపింగ్ కు వెళ్లి తిరిగి వచ్చేసరికి తన గదిలో ఉండాల్సిన వస్తువులు ఉండేవి కావు. వాటిని ఫోటో షూట్లలో వాడుకోవాలని సోనాక్షికి ఇచ్చేవారు. అతడి వల్లే నేనింకా పెళ్లి చేసుకోలేదు. నాకు డ్రగ్స్ ఇచ్చి అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. నా కెరీర్ సర్వ నాశనం అయ్యిందంటే అది శత్రుఘ్న సిన్హా కారణంగానే’’ అంటూ ఆమె తీవ్ర ఆరోపణల్ని చేశారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది.

ఈ సంచలన ఆరోపణలపై శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా రియాక్టు అయ్యారు. ఆమె తన కుటుంబం మీద లేనిపోని ఆరోపణలు చేస్తుందని.. ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని మండిపడ్డారు. ఇలాంటి చెత్త అంశాలపై స్పందించి తన విలువైన సమయాన్ని వేస్టు చేసుకోనని పేర్కొన్నారు. తన కుటుంబం గౌరవాన్ని భంగం వాటిల్లే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.

ఇంతటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో షాట్ గన్ రియాక్టు అవుతారా? ఆయనకు బదులుగా ఆయన కుమారుడు రియాక్టు అవుతూ ఉంటారా? అన్నది ప్రశ్న. ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసిన పూజ.. తన వద్ద ఉన్న ఆధారాల్ని పోలీసులకు ఇవ్వటమో.. లేదంటే ఆన్ లైన్ లో విడుదల చేయటమో చేయొచ్చు కదా? అలా ఎందుకు చేయనట్లు?
Tags:    

Similar News