యాంకర్​ గా పీవీ సింధూ..గేమ్​ వెబ్​ సీరిస్​ లో!

Update: 2020-09-27 10:30 GMT
ప్రముఖ బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవీ సింధూ ఓ కొత్త అవతారం ఎత్తనున్నారు. ఓ వెబ్​ సీరీస్ ​లో యాంకర్ ​గా కనిపించనున్నారట. ప్రముఖ స్పోర్ట్స్ మార్కెటింగ్ సంస్థ బేస్ లైన్ వెంచర్స్ ‘ది ఎ గేమ్’ అనే  వెబ్ సిరీస్ ను భారీ వ్యయంతో నిర్మించనున్నదట. ఈ వెబ్​ సీరిస్​ పూర్తిగా క్రీడలకే సంబంధించింది. అయితే ఇందులో యాంకర్​ గా చేసేందుకు సింధూకు చాన్స్​ దక్కింది. మామూలుగానే యాడ్స్ కు , కొన్ని కంపెనీలకు  బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సింధు భారీ మొత్తంలోనే వసూలు చేస్తోంది. యాంకర్ గా కూడా  సింధూ భారీ పారితోషికం తీసుకోనున్నట్టు టాక్.  అయితే మనదేశంలో వివిధ క్రీడల్లో రాణించిన వాళ్లంతా ఈ గేమ్ ​షోలో పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారట.  ఇది ఓ తరహా ఇంటర్వ్యూ లాంటి కార్యక్రమం. మొత్తం 5 ఎపిసోడ్లను చిత్రీకరించున్నారు.

 ఈ వెబ్​సీరిస్​లో భాగంగా ఇప్పటికే పలువురు ప్రముఖ క్రీడాకారులను సింధూ ఇంటర్వ్యూ చేసింది. రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత - రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ - షూటర్‌ గగన్‌ నారంగ్‌ - లాంగ్‌ జంపర్‌ అంజు బాబీ జార్జ్‌ - ఫుట్‌ బాలర్‌ బైచుంగ్‌ భూటియా - స్నూకర్‌–బిలియర్డ్స్‌ స్టార్‌ పంకజ్‌ అద్వానీలతో సింధు మాట్లాడింది. ఇందులో స్టార్ క్రికెటర్లు - పేరు పొందిన  టెన్నీస్​ క్రీడాకారులు - హాకీ ప్లేయర్లు కూడా ఉండనున్నారట. ఈ సందర్భంగా సింధూ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉన్నది. ఒత్తడి సమయంలో దిగ్గజ అథ్లెట్ల ఆలోచనా విధానాన్ని వారి శక్తి సామర్థ్యాల్ని తాను ఈ షోలో తెలుసుకుంటా’ అని ఆమె చెప్పారు. అయితే ఈ షో టీవీల్లో వచ్చేది కాదు. యూట్యూబ్​ - ట్విట్టర్​ - ఇన్ ​స్టాగ్రామ్ ​లో ప్రసారం కానుంది.
Tags:    

Similar News