కాపుల వ‌ల్లే చిరంజీవి సీఎం కాలేదా..!

Update: 2016-01-05 06:21 GMT
చంద్ర‌బాబు కేబినెట్‌ లో మంత్రిగా ఉన్న దేవాదాయ శాఖా మంత్రి  పైడికొండ‌ల మాణిక్యాల‌రావు రూటే స‌ప‌రేటు. ఆయ‌న ఎవ్వ‌రి మాట విన‌రు త‌న‌కు న‌చ్చ‌ని విష‌యాన్ని చంద్ర‌బాబు ద‌గ్గ‌రైనా ఓపెన్‌ గానే చెప్పేస్తారు. కొన్ని కొన్ని సార్లు ఆయ‌న చ‌ర్య‌ల‌తో చంద్ర‌బాబు సైతం షాక్ అవ్వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఒక్క‌సారి కూడా ఎన్నిక‌కాకుండానే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి ప‌ద‌వి కొట్టేసిన మాణిక్యాల‌రావు తాజాగా త‌న కాపు సామాజిక‌వ‌ర్గంపైనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సోమ‌వారం విశాఖ జిల్లా అన‌కాప‌ల్లిలో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ కాపుల్లో అస్స‌లు క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌ని...కాపుల్లో క్ర‌మ‌శిక్ష‌ణ ఉండి ఉంటే చిరంజీవి సీఎం అయ్యేవార‌ని ఆయ‌న తెలిపారు. క్ర‌మ‌శిక్ష‌ణ లేని జాతి ఏదైనా ఉందంటే అది కాపు జాతి మాత్ర‌మే అని ఆయ‌న త‌న సొంత కులంపైనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక తాను ఈ రోజు చంద్ర‌బాబు కేబినెట్‌ లో మంత్రిగా ఉన్నానంటే అది జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ వ‌ల్లే అని ఆయ‌న చెప్పారు. టీడీపీ విజయానికి పవన్‌ కళ్యాణ్‌ ఎంతో కృషి చేశారని... ప‌వ‌న్ త‌న శ‌క్తి ఏమిటో నిరూపించార‌ని పైడికొండ‌ల ఆవేశంగా ప్ర‌సంగించారు.

పాలకొల్లులో చిరంజీవి ఓటమికి కాపు కులస్తుల్లో క్రమశిక్షణ లేకపోవడమే కారణమని అన్నారు. కాపుల‌ను బీసీల్లో చేర్చేందుకు క‌మిష‌న్ ఏర్పాటైంద‌ని... తొమ్మిది నెల‌ల్లో ఈ క‌మిష‌న్ ప్ర‌భుత్వానికి త‌న నివేదిక అంద‌జేస్తుంద‌ని... భ‌విష్య‌త్తులో ఏపీలో ప్ర‌భుత్వాల త‌ల‌రాత‌ల‌ను కాపులు డిసైడ్ చేసే నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా మార‌నున్నార‌ని ఆయ‌న చెప్పారు. గ‌తంలో రాజ‌స్థాన్‌ లో మోనా అనే కుల‌స్తులు బీసీ రిజ‌ర్వేష‌న్ల కోసం 90 రోజుల పాటు రాష్ర్టంలో పాల‌న‌ను స్తంభింప‌చేసి మ‌రీ త‌మ హ‌క్కుల‌ను సాధించుకున్నార‌ని...ఇప్పుడు కాపులు కూడా ఐక్యంగా ఉంటేనే వారికి గుర్తింపు ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. ఇక విశాఖ జిల్లా య‌ల‌మంచిలి ఎమ్మెల్యే పంచ‌క‌ర్ల ర‌మేష్‌ బాబు మాట్లాడుతూ చిరంజీవి రాజ‌కీయాల్లోకి రాగానే క‌మ్మ‌ - రెడ్డి కుల‌స్తుల‌కు దెబ్బ‌ప‌డుతోంది అంటూ ఫ్లెక్సీలు పెట్టి నానా హ‌డావిడి చేశార‌ని..కాపు కుల‌స్తులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌కూడ‌ద‌ని ఆయ‌న సూచించారు. ఏదేమైనా ఈ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే అన్ని పార్టీల్లో ఉన్న కాపులంద‌రూ రాజ్యాధికారం పొందే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.
Tags:    

Similar News