బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు - టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పడేసే ప్రక్రియను ఇంకా కొసాగిస్తూనే ఉన్నారు. కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆర్.కృష్ణయ్య గళం విప్పడంతో చంద్రబాబు ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్ లో చంద్రబాబు-ఆర్.కృష్ణయ్య మధ్య భేటీతో ఈ వివాదం సద్దుమణిగిందని భావించారు. అయితే ఇది ఇంకా కొనసాగుతోంది. తాజాగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏపీలో నిర్వహించిన సమావేశంలో మరోమారు కృష్ణయ్య సర్కారు తీరును తప్పుపట్టారు.
కాపుల రిజర్వేషన్ కోసం నియమించిన మంజునాథ కమిషన్ రిపోర్టులను బయట పెట్టకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసి గుట్టుచప్పుడు కాకుండా కాపు రిజర్వేషన్లు ప్రవేశపెట్టటం శోచనీయమని ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. దీని వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ అనేక పోరాటాల ద్వారానే బీసీలకు సంబంధించిన అభివృద్ధి ఫలాలను సాధించుకున్నామని ఇప్పుడు వాటిని కాపులకు కట్టబెట్టాలని చూస్తే సహించేది లేదని ఆర్.కృష్ణయ్య తెలిపారు. అన్నికులాల్లో పేదలున్నారని వారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా పథకాలు అమలు చేయాలని ఆయన సూచించారు. అగ్రకులాల్లో అభివృద్ధిపై లెక్కలు తీసి దాని ప్రకారంగానే రిజర్వేషన్లు అందించాలన్నారు. బీసీలపై సామాజిక వివక్షను తాము సహించేది లేదని అన్నారు.
రిజర్వేషన్లు సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారంగానే జరగాలని...రాజకీయ అవసరాలకు తగినట్లుగా కాదని ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలంతా ఏకతాటిపై ఉండి ఓట్ల రాజకీయాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కాపు రిజర్వేషన్లపై బీసీ ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. తమ పదవుల కోసం బీసీలను మోసం చేస్తారా అని ప్రశ్నించారు. పోరాటాల ద్వారానే పాలకులకు బుద్ధి చెప్పాలన్నారు.
పార్లమెంటులో బీసీల బిల్లు పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల నుండి బిసీ సంఘాల ప్రతినిధులను ప్రధాని వద్దకు తీసుకెళ్ళాలని ఆర్.కృష్ణయ్య కోరారు. బీసీలకు రాజకీయంగా - సామాజికంగా - ఆర్థికంగా అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించినప్పుడే ఆయారాజకీయ పక్షాలకు మద్దతునిస్తామని ఆయన స్పషం చేశారు. 56 శాతం ఉన్న బీసీలకు కేవలం 34 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ఐతే వంద మందికి సీట్లు ఇస్తుందో బీసీలంతా వారికే మద్దతునిస్తామని ప్రకటించారు. 139 బీసీ కులాలుంటే దాదాపు 125 కులాల వారు కనీసం చట్ట సభలలో అడుగు పెట్టలేదన్నారు. అన్ని రంగాలలో వీరు వెనుకబాటుగానే ఉన్నారని ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యాధికారం కోసం మార్చి 18న ఉగాది నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి బీసీల్లో చైతన్యం తీసుకురానున్నట్లు ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్న సంస్కృతికి చరమగీతం పాడతామన్నారు. బీసీలు ఆర్థికంగా నిలబడాలన్నారు. పాలకులెవరు సహకరించకపోయినా బీసీలకు సంక్షేమ సంఘం అండగా ఉంటుందన్నారు. అనేక పోరాటాల ద్వారానే 11 ఫెడరేషన్లను పెట్టించగలిగామన్నారు. బీసీల అభ్యున్నతి కోసం దాదాపు 2వేల జీఓలను సాధించామని ఆర్.కృష్ణయ్య వెల్లడించారు.