జాతీయ గీతాన్ని అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొంటూ బడ్జెట్ సెషన్ వరకూ సస్పెండ్ అయిన తెలంగాణ తెలుగుదేశం నేతల గురించి తెలిసిందే. సస్పెండ్ అయిన తెలుగుతమ్ముళ్లలో.. ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే.. ఉద్యమనేత ఆర్ కృష్ణయ్య లేరు.
సస్పెండ్ కాకున్నా.. ఆయన మాత్రం అసెంబ్లీకి హాజరు కావటం లేదు. తెలంగాణ బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు విపరీతమైన అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కృష్ణయ్యను కలిసిన మీడియా మిత్రులు.. కృష్ణయ్యను ఒక సూటి ప్రశ్న వేశారు.
బీసీలకు అన్యాయం జరిగిందని అగ్రహం వ్యక్తం చేస్తున్న మీరు.. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చెప్పొచ్చు కదా? అసెంబ్లీకి ఎందుకు వెళ్లటం లేదు? అని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన కృష్ణయ్య.. సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు తనను అసెంబ్లీకి వెళ్లద్దని చెప్పారని.. అందుకే తాను అసెంబ్లీకి వెళ్లటం లేదని అసలు విషయాన్ని చెప్పారు. మొత్తానికి తాము సస్పెండ్ కావటమే కాదు.. సస్పెండ్ కాని నేతల్ని కూడా తమ్ముళ్లు ఆపేశారన్నమాట.