ఎన్నికలు పూర్తయిన మూడేళ్ల తర్వాత కాపులకు రిజర్వేషన్ హామీని నిలుపుకొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతుంటే...మరోవైపు ఈ పరిణామంపై ఆయన ఇరకాటంలో పడే పరిస్థితులు స్పష్టంగా తెరమీదకు వస్తున్నాయి. కాపు రిజర్వేషన్ పై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ తరఫున ఎల్బీ నగర్ నుంచి గెలిచిన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. పోరాటానికి సిద్ధమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మరో అడుగు ముందుకు వేసి...ఏకంగా రాజీనామాకు సిద్ధపడ్డారు.
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ నేడు ఏకగ్రీవ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై బీసీ ఉద్యమ నేత - టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ కాపులను బీసీల్లో కలుపుతూ ఏపీ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆర్. కృష్ణయ్య అన్నారు. దీనిపై తాము న్యాయపరమైన పోరాటం చేస్తామని వెల్లడించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన తేల్చిచెప్పారు.
కాపులకు రిజర్వేషన్ అంటే బీసీలను మోసం చేయడమేనని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. ఏపీలో కాపులకు బీసీ-ఎఫ్ కేటగిరీగా 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆచరణలో అమలు కాదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఏపీ, తెలంగాణలో రిజర్వేషన్లను ప్రభుత్వాలు పెంచుతున్నాయని ఆరోపించారు. తెలుగు ప్రభుత్వాల నిర్ణయం రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమన్నారు. బోయలను ఎస్టీల్లో కలిపితే అభ్యంతరం లేదన్నారు.