ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వత నుంచి అమెరికాలో పరిస్థితులు మారిపోవటం తెలిసిందే. అతివాదులు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం ఎక్కువైంది. దేశాధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి విదేశీయులపై జాతివిద్వేష దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఈ దాడుల కారణంగా ఇప్పటికే పలువురు భారతీయులు చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు.
కొన్ని సందర్భాల్లో ఈ దాడుల కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలూ ఉన్నాయి. తాజాగా విద్వేష దాడికి తీవ్ర అవమానానికి గురైన ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్ లోని సిక్కు క్యాబ్ డ్రైవర్ పై విద్వేష దాడి జరిగింది. 25 ఏళ్ల సిక్కు యువకుడు హరకీరత్ సింగ్ పై నలుగురు అమెరికన్లు విద్వేష దాడికి పాల్పడినట్లుగా చెబుతున్నారు.
ఫుల్ గా డ్రింక్ చేసిన వారితో మరో ముగ్గురు కలిసి తన కారు ఎక్కారని.. కారు ఎక్కింది మొదలు ఎక్కడికి వెళ్లాలో చెప్పకుండా తిట్టటం షురూ చేశారని చెప్పాడు. తనతో అనుచితంగా ప్రవర్తించటంతో పాటు.. నలుగురిలో ఒకరు తనపై దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే తలపాగాను ఊడదీసి తీసుకెళ్లిపోయారు.
ఈ ఘటన జరిగిన నాటి నుంచి రాత్రిళ్లు పని చేయటానికి భయమేస్తుందని హరకీరత్ సింగ్ వెల్లడించాడు. ఈ దాడికి కొద్దిరోజుల ముందే విద్వేష దాడులకు నిరసనగా ప్రవాస సిక్కులు ప్రచారం నిర్వహించారు. ఇది జరిగిన వారానికే దాడి జరగటంపై ప్రవాసభారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన తలపాగా తీసుకెళ్లటం ద్వారా తన మతానికి అవమానం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదంతంపై న్యూయార్క్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/