ఇండియా , న్యూజిలాండ్ మధ్య ఇంగ్లాండ్ , సౌతాంప్టన్ లోని రోజ్ బౌల్ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐదో రోజు అంటే మంగళవారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు మైదానంలోని న్యూజిలాండ్ ఆటగాళ్ల పై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. స్టేడియం లోని 'ఎం' బ్లాక్ లో కూర్చున్నారు. అయితే, ఆ సమయంలో అక్కడ కనపడిన న్యూజీలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జాతివివక్ష వ్యాఖ్యలతో పాటు అనుచితంగా మాట్లాడినట్లు గుర్తించారు. వెంటనే భద్రతా సిబ్బందికి విషయం తెలియజేయడంతో వారిని మైదానం నుంచి బయటకు పంపేశారు.
కాగా, ఈ ఘటన పై ఐసీసీ స్పందించింది. రోజ్ బౌల్ స్టేడియంలో ఇద్దరు వ్యక్తులు ఆటగాళ్లను దూషించినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని క్రికెట్ స్టేడియం నుంచి పంపేశారు. వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేస్తే మాత్రం అస్సలు ఉపేక్షించం అని ఐసీసీ తెలిపింది. ఎం బ్లాక్‌లో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఆటగాళ్లపై అభ్యంతర రీతిలో దూషిస్తున్నట్లు ఇతర అభిమానుల ద్వారా ఐసీసీకి సోషల్ మీడియాలో పిర్యాదు చేశారు. ఈ పిర్యాదును అందుకున్న తర్వాతే ఐసీసీకి చెందినే భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకొని విషయాన్ని దృవీకరించుకున్నారు. అనంతరం వెంటనే ఇద్దరు వ్యక్తులను బయటకు పంపించేశారు.
ఇదిలా ఉంటే , ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి వర్షం ఆటంకాల మధ్య సాగుతూనే ఆసక్తికరంగా మారింది. ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 217కు ఆలౌట్ కాగా , ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజీలాండ్ జట్టు 249 పరుగులకు అల్ అవుట్ అయింది. షమి, ఇషాంత్ శర్మ కలిసి కివీస్ ఆట కట్టించారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు తడబడింది. కీలకమైన ఓపెనర్ల వికెట్లను ఐదో రోజే కోల్పోయింది. ఇక ఆరో రోజు ఆట ప్రారంభించిన కాసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ 13 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. ప్రస్తుతం పుజారా , రహానే క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 74 పరుగులు సాధించింది