రెండు రోజుల్లో 6వేల కోట్లు కొల్ల‌గొట్టిన ఘ‌నుడు

Update: 2018-02-19 07:24 GMT
మ‌న‌దేశంలో సంప‌న్నులు ఎవ‌రు అంటే ముందుగా మ‌న‌కు ఠ‌క్ మ‌ని గుర్తొచ్చేది ముఖేష్ అంబానీ - అనీల్ అంబానీ . కానీ గ‌త కొద్దిరోజు నుంచి ఓ వ్య‌క్తి పేరు ప‌దే ప‌దే మారుమ్రోగుతుంది. కేవ‌లం రెండు రోజుల్లో రూ. 6000కోట్ల‌కు పైగా లాభాల్ని కొల్ల‌గొట్టి 20మంది ధ‌న‌వంతుల జాబితాల్లోకి చేరిపోయారు. అత‌ను మ‌రెవ‌రో కాదు డీ- మార్ట్  వ్య‌వ‌వ‌స్థాప‌కుడు రాధాకిష‌న్ ద‌మాని. రాజ‌స్థాన్ లోని బికాన‌ర్  మార్వాడి కుటంబంలో జన్మించిన ద‌మానీ ఫోర్బ్ జాబితాలో 9వ స్థానాన్ని ద‌క్కించుకున్నారు.

 ముంబైకి చెందిన హైపర్మార్కెట్ చైన్ - డి-మార్ట్ వ్యవస్థాపకుడు రాధా కిష‌న్ దామాని డీ- మార్ట్ పేరుతో భార‌త్ దేశం మొత్తం సూప‌ర్ మార్కెట్ల‌ను విస్త‌రించారు. మహారాష్ట్ర - ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ - గుజరాత్ - మధ్యప్రదేశ్ - ఛత్తీస్ గఢ్ - రాజస్థాన్ - జాతీయ రాజధాని - తమిళనాడు - కర్నాటక - డామన్ - డయ్యు - పంజాబ్ ల‌లో మొత్తం 141 మార్కెట్లను విస్త‌రించారు. దీని నిఖ‌ర లాభం మార్చి 22,2017న రూ.39,988కోట్లు ఉండ‌గా సెప్టెంబ‌ర్ 16 - 2017న రూ.67000కోట్ల‌కు పెరిగింది.

దీంతో పాటు స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెట్టిన మూడు రోజుల వ్య‌వ‌ధిలో రూ.27వేల ల‌క్ష‌ల కోట్ల‌తో సంప‌న్నుడిగా ఉన్న అనీల్ అంబానీని క్రాస్ చేశాడు.

అయితే  దీంతో ద‌మానికి కేవలం రెండు రోజుల్లోనే 4300 కోట్లను కొల్ల‌గొట్టాడు. అదెలా సాధ్య‌మైందంటే ఇటీవల ట్రేడింగ్ మొదలు పెట్టిన షేర్లు తార జువ్వ మాదిరి దూసుకెళ్లాయి. లిస్టింగ్ డే రోజే ఏకంగా 114 లాభం తో ఎగసిన ఆయన షేర్లు విప‌రీతంగా పెరిగిపోయాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 141  డీ - మార్ట్ స్టోర్ ల షేర్ అప్ప‌టి వ‌ర‌కు స్త‌బ్ధుగా ఉన్న షేర్ ఒక‌సారిగా ఆకాశానికి తాకింది. దీంతో కేవలం రెండు రోజుల వ్య‌వ‌ధిలో రూ. 6000కోట్ల సంపాదించి రికార్డ్ సృష్టించారు. తాజా ట్రేడింగ్ లో లో ఈ షేర్ కు 714 రూపాయల గరిష్ట స్థాయిని చేరుకోగా దామని కుటుంబ ఆస్తుల్లోకి అక్షరాలా 4300 కోట్ల జత చేరాయి. ధమని కురుంబనికి అవెన్యూ సూపర్ మార్కెట్ లో 82 .2 శతం స్టాక్స్ కలిగి ఉండటం గమనార్హం. తాజాగా పెరిగిన డి-మార్ట్ షేర్ ధరతో రాదా కిషన్ ధమాని 20 వ అత్యంత భారతీయ ధనవంతుడిగా రికార్డులకెక్కారు -అంతే కాకుండ మొదటి 500 బిలినియర్ల లో ఒకరు గా చోటు దక్కింది.
Tags:    

Similar News