సినీ స్టార్.. సెలబ్రిటీ.. లేదంటే స్పోర్ట్స్ పర్సన్ కు అమ్మాయిల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ..బాగా చదువుకొని.. చక్కటి పొజిషన్లో ఉండే అవకాశం ఉన్నప్పటికి.. దాన్ని కాదనుకొని ప్రజాసేవ చేయటం కోసం రాజకీయాల్లో వచ్చే వారికి అంత ఎక్కువ క్రేజ్ ఉండదు. కానీ.. క్రేజీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా ఇందుకు మినహాయింపుగా చెప్పాలి. చార్టెడ్ అకౌంటెంట్ నుంచి రాజకీయనేతగా మారిన ఇతగాడికి మహిళా అభిమానులు ఎక్కువ. మహిళల్లో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
తాజాగా ఆయనకు కీర్తి అనే మహిళ పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చారు. రాఘవ్.. నన్ను పెళ్లి చేసుకుంటారా? అని ట్వీట్ చేసింది. దీనికి రాఘవ్ నుంచి వచ్చిన రిప్లై ఇప్పుడు అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది. కీర్తి ట్వీట్ కు స్పందించిన రాఘవ.. సారీ కీర్తి.. దేశ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు. కాబట్టి పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించటం సరైనది కాదు. అచ్చేదిన్ వచ్చాక మనం పెళ్లి గురించి చర్చించుకుందామని బదులిచ్చాడు.
అమ్మాయి పెళ్లి చేసుకుందామా? అని అడిగితే.. ఒకవైపు సున్నితంగా సమాధానం ఇస్తూనే.. మరోవైపు మోడీ సర్కారు పాలన పుణ్యమా అని దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేయటమే కాదు.. మోడీ మార్క్ అచ్చే దిన్ ను తనదైన శైలిలో ప్రస్తావించిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది.
రాఘవ రిప్లైకు నెటిజన్లు సైతం పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. సరదాగా రిప్లై ఇస్తున్నారు. రాఘవ బదులు హైలెట్ గా ఉందని ఒకరు వ్యాఖ్యానిస్తే.. హీరోల కంటే ఎక్కువగా ఒక ప్రజాప్రతినిధిపై అమ్మాయిలు మనసు పారేసుకుంటున్నారంటూ మరొకరు వ్యాఖ్యానించటం గమనార్హం. ఏమైనా.. ఒక రాజకీయ నేతకు ప్రపోజల్ చేసేయటం లాంటివి రాఘవతోనే షురూ అయ్యాయని చెప్పక తప్పదు.