రాజుగారి కడుపుమంట అర్ధమవుతోందా ?

Update: 2022-03-26 05:27 GMT
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డంటే తిరుగుబాటు ఎంపీకి ఎంత  తీవ్ర వ్యతిరేకత ఉందో అందరికీ తెలుసు. మరోసారి తన కడుపుమంట రాజుగారు బయటపెట్టుకున్నారు. రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు సంబంధించి జగన్ సుదీర్ఘంగా మాట్లాడారు. దానిపైన తిరుగుబాటు ఎంపీ ఢిల్లీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం కన్నా శాసనవ్యవస్ధే గొప్పదంటూ అసెంబ్లీలో జగన్ చేసిన చర్చ ఉత్త రచ్చలాగుందన్నారు. హైకోర్టు పైన, రాజ్యాంగం పై జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు. సరే ఇఫ్పటికే చాలా అంశాల్లో జగన్ కు వ్యతిరేకంగా ఎంపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు నియమించిన కమిటియే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని చెప్పారు.

రాజధానిని మార్చాలంటే విభజన చట్టాన్ని సవరించి మళ్ళీ పార్లమెంటులో బిల్లు పెట్టాలట. నిజంగా ఇక్కడే రాజుగారి పైత్యమంతా బయటపడుతోంది. ఎలాగంటే రాజ్యాంగం కన్నా అసెంబ్లీయే గొప్పని జగన్ ఎక్కడా చెప్పలేదు. అమరావతి నిర్మాణంలో హైకోర్టు తీర్పు ఆచరణ సాధ్యం కాదని మాత్రమే జగన్ చెప్పారు. మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని ప్రకటించారు. తీర్పిచ్చిన హైకోర్టును జగన్ ఎక్కడా నెగిటివ్ గా ఒక్క మాటనలేదు.

అలాగే పార్లమెంటు నియమించిన కమిటీయే అమరావతిని ఎంపిక చేసిందని చెప్పడం అబద్ధం. రాజధాని ఎంపికపై పార్లమెంటు అసలు కమిటియే వేయలేదు. శివరామకృష్ణన్ కమిటిని వేసింది ప్రభుత్వమే కానీ పార్లమెంటు కాదు. పైగా ఈ కమిటీ కూడా పలానా ప్రాంతాన్ని రాజధానిగా చేసుకోమని ఎక్కడా సిఫారసు చేయలేదు. రాజధానిగా వివిధ ప్రాంతాలకున్న ప్లస్సులు, మైనస్సులను మాత్రమే వివరించింది. అమరావతిని రాజధానిగా చంద్రబాబునాయుడు తనిష్ట ప్రకారం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ అనని మాటలను అన్నట్లు తిరుగుబాటు ఎంపీ పదే పదే చెబుతున్నారు.
Tags:    

Similar News