చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 7ని సవాల్ చేస్తూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. నాటక ప్రదర్శనను నిషేధిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరారు. వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సామాజిక సంస్కర్త కాళ్లకూరి నారాయణరావు చింతామని నాటకాన్ని రచించారని, వందేళ్లకుపైగా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని, దీనిపై వేల మంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. నాటక ప్రదర్శనను నిలిపివేస్తే కళాకారులు రోడ్డున పడతారని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును హరించడమేన్నారు.
నాటకంలోని `ఒక పాత్ర` కారణంగా మొత్తం నాటక ప్రదర్శనపై నిషేధం విధించడం అనాలోచిత చర్య అని, వీటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని ఆ వ్యాజ్యంలో కోరారు. చింతామని నాటకాన్ని ఏపీలోని వైసీపీ ప్రభుత్వం నిషేధించింది. చింతా మణి నాటకాన్ని ప్రముఖ కవి కాళ్లకూరి నారాయణరావు రాశారు. దీనిలో ప్రధాన పాత్ర ధారి సుబ్బిశెట్టి. ఈయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యాపారి. వేశ్యలపై ఈయనకు మంచి మోజు.. దీంతో ఎక్కువగా వారి వద్దే ఉండేవాడు. ఈ నాటకంలో క్కువగా డబుల్ మీనింగ్ డైలాగులు రాశారనే కారణంతో వైశ్య సామాజిక వర్గానికే చెందిన వారి ఒత్తిడి మేరకు చింతామణిపై బ్యాన్ విధిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.
అయితే.. కళాప్రియులు, నాటక ప్రియులు మాత్రం.. దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంపీ రఘురామ కూడా కోర్టుకు వెళ్లారు. ఈయనతోపాటు.. చింతామణి నాటకం రద్దుపై ఏపీ హైకోర్టులో ఆర్టిస్ట్ అరుగు త్రినాథ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో ఆర్టిస్టులు రోడ్డునపడ్డారని లాయర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. అత్యవసర పిటిషన్‌గా స్వీకరించాలని శ్రావణ్ కుమార్ కోరారు. ఈ పిటిషన్‌ను మంగళవారం ఏపీ హైకోర్టు విచారించనుంది. రఘురామ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా, సాంస్కృతి శాఖ, యువజన సర్వీసుల శాఖల అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చడం గమనార్హం.