అమరావతి శాశ్వతం.. అడ్డంపడేవారు అశాశ్వతం: రఘురామ సూక్తులు

Update: 2021-12-17 12:30 GMT
వైసీపీ రెబల్  ఎంపీ రఘరామకృష్ణంరాజు మరోసారి ప్రత్యర్థులతో కలిసి కనిపించి సొంత పార్టీ అధినేతపై ఆడిపోసుకున్నారు. తిరుపతిలో అమరావతి రైతుల మహోద్యమ సభలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల గురించి మాట్లాడేవారు ఉండరని అన్నారు. నూటికి నూరుశాతం అమరావతియే రాజధానిగా ఉంటుందని.. అమరావతి శాశ్వతం.. అడ్డంపడేవారు అశాశ్వతమంటూ వ్యాఖ్యానించారు. తాను ఎవరికీ భయపడనన్న రఘురామ అందుకే ధైర్యంగా తిరుపతి వచ్చానన్నారు.

ఎంపీ రఘురామ ఢిల్లీ నుంచి నేరుగా రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఎంపీకి అమరావతి రైతులు ఘనస్వాగతం పలికారు. తిరుపతిలో జరుగుతున్న అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభకు హాజరయ్యారు.

రాష్ట్రంలో దగాపడ్డ రైతుల సభగా మహోద్యమ సభను అభివర్ణించారు. వాళ్ల వ్యధను అర్థం చేసుకున్న ప్రజలందరూ వారికి మద్దతు పలకడానికి వచ్చిన సభగా అభిప్రాయపడ్డారు. అందులో రాజకీయ నేతలు సహా ఎవరైనా ఉండొచ్చన్నారు.

గురువారం వరకూ అమరావతి రైతుల వెళ్లడంపై రఘురామకే క్లారిటీ లేదు. తనకు వై కేటగిరి సెక్యూరిటీ ఉంది కాబట్టి ఏపీలో భద్రతాపరమైన అంశాలపై పోలీసుల నుంచి అనుమతి కావాలి అన్నారు. తనకు అనుమతి వస్తుందని ఆశతో ఉన్నానని.. కుదరకపోతే వర్చువల్ గా సభలో పాల్గొంటానని తేల్చిచెప్పారు. కానీ రఘురామకు ఏపీ పోలీసుల నుంచి క్లియరెన్స్ రావడంతో తిరుపతి సభకు వెళ్లారనే చర్చజరుగుతోంది. పోలీస్ సెక్యూరిటీ ఇవ్వడంతోనే సభకు వచ్చానన్నారు.

తిరుపతి సభకు వెళితే తనపై దాడి జరిగే ప్రమాదం ఉందని రఘురామ ఆరోపించారు. మా నర్సాపురం వాళ్లు.. ముఖ్యంగా నన్ను ప్రేమిస్తున్న ఓ 15మందిని తీసుకొచ్చి వీలైతే నా కులానికి చెందిన ముగ్గురిని తీసుకొచ్చి ఎదురుపెట్టి తిరుపతిలో కరునాకర్ రెడ్డి, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి మనుషులు నా మీద గుడ్లు విసిరేసి అక్కడకు వెళ్లకుండా చేయాలనుకుంటున్నట్లు తెలిసింది అని అన్నారు. కానీ అలాంిదేమీ లేకుండానే సభలో రఘురామ పాల్గొని ప్రసంగించారు.
Tags:    

Similar News