ఏపీ సీఐడీకి రఘురామ షాక్

Update: 2021-05-31 13:32 GMT
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏపీ సీఐడీకి షాకిచ్చారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మానవహక్కుల కమిషన్ విచారణ చేపడుతామని హామీ ఇచ్చినట్టు సమాచారం.

ఎంపీ రఘురామ ఢిల్లీలో కేంద్రమంత్రులు.. బీజేపీ పెద్దలను కలుస్తూ బిజీగా గడుపుతున్నారు. తనపై కేసు పెట్టిన ఏపీ సీఐడీ పై తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్సీ) ని ఆశ్రయించారు. ఈరోజు కమిషన్  కమిషన్ చైర్మన్ పీసీ పంత్ ను కలిసిన ఎంపీ రఘురామ.. ఏపీ సీఐడీ పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే రఘురామ అరెస్ట్ అయిన సమయంలో ఆయన కుమారుడు భరత్ కూడా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. రఘురామను కొట్టారా? అన్న విషయంపై ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది.

ఈరోజు స్వయంగా రఘురామ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. అరెస్ట్ నుంచి ఇప్పటిదాకా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ స్వయంగా ఫిర్యాదు చేశారు. రఘురామ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ చైర్మన్ కూడా అన్ని విషయాలపై విచారణ చేపడుతామని చెప్పినట్లు సమాచారం.
Tags:    

Similar News