వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు విషయంలో విచారణ చేస్తున్న సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం ఈ కేసులో ప్రతివాదిగా ఏపీ సర్కార్ ని చేర్చాలని పేర్కొంది. ఈ కేసును రఘురామ కుమారుడు భరత్ దాఖలు చేశారు. తన తండ్రి రఘురామ క్రిష్ణం రాజు మీద రాజద్రోహం కేసు పెట్టి సీఐడీ విభాగం పోలీసులు కస్టడీకి తీసుకుని టార్చర్ చేశారని ఆరోపించారు.
దీని మీద సుప్రీం కోర్టులో విచారణ జరిగిన సందర్భంగా ఇపుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశాలు జారీ చేస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో రెండు వారాల గడువుని భరత్ తరఫున న్యాయవాది కోరారు. దాంతో ఏపీ సర్కార్ ని ప్రతివాదిగా చేర్చిన మీదటనే ఈ కేసును సీబీఐకి అప్పగించే విషయం పరిశీలిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది.
ఇదిలా ఉండగా గత ఏడాది రఘురామ క్రిష్ణం రాజు పుట్టిన రోజు వేళ హైదరాబాద్ లో తన ఇంట్లో ఉన్నపుడు ఏపీ సీఐడీ పోలీసులు వెళ్ళి ఆయన్ని గుంటూరుకు తీసుకువచ్చారు. అపుడు సీఐడీ కస్టడీలో ఉన్నపుడు పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు అని రఘురామ ఆరోపించారు. దీని మీద ఆర్మీ ఆసుపత్రి నివేదిక కూడా రఘురామ పాదాలకు గాయాలు ఉన్నట్లుగా తేల్చింది.
అంతే కాకుండా ఆయన రెండు పాదాలూ దిగువన ఉబ్బిపోయి ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. అలాగే అరికాళ్ళు వాచడం, మొత్తం పాదాల నుంచి చాలా వరకూ గాయాలు ఏర్పడడం జరిగింది అని పేర్కొంది. దాంతో రఘురామ నడవలేని పరిస్థితి ఏర్పడింది అని కూడా నివేదిక పేర్కొంది. ఈ నేపధ్యంలో రఘురామ సీఐడీ కస్టడీలో ఉన్నపుడు జరిగిన హింస మీద అలాగే ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసిన తీరు మీద కూడా సీబీఐ విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషం మీద కేంద్రానికి సీఐడీకి కూడా నోటీసులు గతంలో ఇచ్చారు
ఇక చూస్తే ఈ కేసులో ఇపుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చడం కీలకమైన్ పరిణామంగా చూడాలి. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు ఎలా వినిపిస్తుందో చూడాలి. ఇక సీబీఐ కి ఈ కేసులు అప్పగించాలన్న పిటిషనర్ల విన్నపాల మీద కోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు మాత్రం ఇపుడు సంచలనం కలిగించే విధంగా ఉంది. నిజనా ఆయన్ని చిత్రహింసలకు గురి చేసినట్లు తేలితే మాత్రం రాజకీయ ప్రకంపనలు రేగే అవకాశాలు కూడా ఉంటాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.