ఆయన రాజు గారు. దానికి ముందు రెబెల్ అని కూడా తగిలించాలి. ఆయన జీవిత కాల కోరిక అయిన ఎంపీ కావడాన్ని 2019 ఎన్నికల్లో తీర్చేసుకున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అన్నీ తిరిగేసి చివరికి రెండోసారి వైసీపీ ఆఫీస్ మెట్లు ఎక్కేసి జగన్ ద్వారా టికెట్ సంపాదించి ఎంపీ అయిపోయారు. జస్ట్ ఆరు నెలలు జాగ్రత్తగా ఉన్నారేమో. నాటి నుంచి ఆయన సొంత స్టైల్ లో పాలిటిక్స్ మొదలెట్టారు. జగన్ని విమర్శిస్తూ రెబెల్ రాజా అయిపోయారు.
మొత్తానికి మెజారిటీ పదవీకాలం పూర్తి చేశారు. ఇక మరో ఏణ్ణర్ధంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. దాంతో రాజా వారు ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ సాగుతోంది. అచ్చొచ్చిన నర్సాపురం నుంచి ఆయన పోటీ చేస్తారా అంటే అది కాదేమో అని అంటున్నారు. ఇపుడు ఆయన చూపు రాజమండ్రీ మీద పడిందట. రాజమండ్రీ నుంచే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దిగుతారు అని గత కొన్నాళ్ళుగా ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది.
ఈ విధంగా చూస్తే ఒక రూమర్ రాజమండ్రీలో చక్కర్లు కొడుతోంది. ఆయన తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా రాజమండ్రీ నుంచి పోటీలో ఉంటారని అంటున్నారు. ఇక రాజమండ్రీలో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న మార్గాన భరత్ వచ్చే ఎన్నికల వేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు. భరత్ రాజమండ్రీ సిటీ సీటు నుంచి బరిలో ఉంటారని ప్రచారం అయితే సాగుతోంది.
రఘురామ క్రిష్ణంరాజు జనసేన టీడీపీ తరఫున బరిలో ఉంటే కచ్చితంగా గెలిచి తీరుతారు అని అంటున్నారు. అయితే రాజమండ్రీ ఎంపీ సీటు విషయంలో చాలా పోటీ ఉందని అంటున్నారు. దాంతో ఏమి జరుగుతుందో చెప్పలేమని కూడా అంటున్నారు. అయితే రెబెల్ రాజా వారు రాజమండ్రీ నుంచి రంగంలో ఉంటే ఆ రాజకీయ కళే వేరుగా ఉంటుంది అని కొత్తగా చెప్పాల్సింది లేదు.
ఇక టీడీపీ జనసేన అయినా అన్ని రకాలైన లెక్కలు అంచనాలు వేసుకుని మరీ టికెట్లు ఇస్తాయి. దాంతో లోకల్ క్యాండిడేట్లు కూడా చూసుకుంటారు. అయితే నర్సాపురం రెబెల్ రాజు గారు జగన్ మీద తిరుగుబాటు చేసి పాపులర్ అయిపోయారు. దాంతో ఆయన స్టేట్ వైడ్ పొలిటికల్ ఫిగర్ గా ఉన్నారు. కాబట్టి రాజమండ్రీ నుంచి పోటీ చేసినా ఆ గ్లామర్ కంటిన్యూ అవుతుంది అంటున్నారు.
అయితే రాజమండ్రీ హిస్టరీ చూస్తే కమ్మలు, బ్రాహ్మిన్స్ కాపులు ఇక్కడ నుంచి ఎక్కువగా గెలిచారు. అలాగే రాజుల తరఫున 2009 ఎన్నికల్లో క్రిష్ణం రాజు పోటీ చేస్తే ఓడారు. ఇదొక ట్రాక్ రికార్డు ఉంది. దాంతో అన్నీ కూడా రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి. ఏది ఏమైనా రాజు గారు విపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్ధి. పైగా జగన్ మీద ఆయన ఒక బ్రహ్మాస్త్రం. దాంతో ఆయన్ని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకుంటారు మరి.