ఆయన వైసీపీ అధినాయకత్వానికి పంటి కింద రాయిలా తగిలారు. గెలిచిన కొద్ది నెలలు కూడా కాలేదు నేరుగా హై కమాండ్ మీదనే కాలు దువ్వారు. ఈ విషయంలో అటూ తప్పు ఉందనుకోండి. అయినా సరే రఘురామ దూకుడుకు అడ్డుకట్ట వేయడం అన్నది పార్టీ పెద్దల వల్ల కాలేదు. ఇక చేసేది లేక 2020లో మంచి కరోనా టైమ్ లో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ వైసీపీ ఎంపీలు అంతా ఢిల్లీకి వెళ్ళి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలసి ఆయన మీద అనర్హత వేటు వేయాలని వినతిపత్రం ఇచ్చారు.
ఇది జరిగి రెండేళ్ళు కావస్తోంది. స్పీకర్ ఆ ఫిర్యాదును ప్రివిలేజి కమిటీకి పంపారు. అక్కడ విచారణ సాగుతోంది. అయితే ఇంతలో స్పీకర్ ఆఫీస్ లేటెస్ట్ గా స్పందించింది. ముఖ్యమంత్రిని మంత్రులను ఒక ఎంపీ విమర్శించినంత మాత్రాన అది అనర్హత కిందకు అసలు రానే రాదు అని స్పష్టం చేసింది. ఒక ఎంపీ మీద అనర్హత వేటు వేయాలీ అంటే అతను పార్టీ జారీ చేసిన విప్ ని ధిక్కరించాలని పేర్కొంది.
రఘురామ విషయంలో నిత్యం వైసీపీ సర్కార్ ని మంత్రులను ముఖ్యమంత్రిని కూడా విమర్శిస్తున్నారు. అదే ఆధారంగా చేసుని అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ కోరుతోంది. మరి దీని మీద స్పీకర్ అఫీస్ ఈ మేరకు వివరణ ఇచ్చింది. దీనిని బట్టి చూస్తే రఘురామ సేఫ్ జోన్ లోనే ఉన్నట్లుగా అర్ధం అవుతోంది. అదే టైమ్ లో ఆయన ఇంకా రెచ్చిపోయి ముఖ్యమంత్రి జగన్ సహా ఎవరిని అయినా విమర్శించుకోవచ్చు అని కూడా అంటున్నారు.
ఇక రఘురామ కూడా మొదటి నుంచి అదే చెబుతున్నారు. తాను ప్రభుత్వం తీరుని తప్పుపడుతున్నారు కానీ పార్టీ ధిక్కార కార్యక్రమాలకు ఎక్కడా పాల్పడలేదని, అందువల్ల తన మీద అనర్హత వేటు వేయించలేరని కూడా ఆయన సవాల్ చేస్తూ వస్తున్నారు.
ఇపుడు స్పీకర్ ఆఫీస్ కూడా అదే చెప్పడంతో రఘురామ ఫుల్ జోష్ లోనే తేలిపోవాల్సిందే. ఇంకా ఆయన తన పదునైన విమర్శలను వైసీపీ సర్కార్ మీద కూడా ఎక్కుబెట్టవచ్చు కూడా. ఇక స్పీకర్ ఆఫీస్ ఈ మాటను చెబుతూ ప్రస్తుతం ప్రివిలేజ్ కమిటీ ముందు రఘురామ అనర్హత పిటిషన్ పరిశీలనలో ఉందని పేర్కొంది. ఇక ఆ విచారణ ఎపుడు పూర్తి అవుతుంది అన్నది కమిటీయే చెబుతుంది అని కూడా తెలిపింది.
ఇవన్నీ పక్కన పెడితే రఘురామ మాత్రం ఇక స్పీకర్ ఆఫీస్ ఇచ్చిన స్పష్టతతో రెచ్చిపోవడం ఖాయం. ఇక మీదట రఘురామ రచ్చబండలకు వైసీపీ అధినాయకత్వం సిద్ధంగా ఉండాల్సిందే. అయితే వైసీపీకి ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించడం. అదే కనుక చేస్తే మాత్రం ఆయన ఫ్రీ బర్డ్ అవుతారు. కానీ వైసీపీ మా పార్టీ ఎంపీ అని చెప్పుకోకుండా విపక్ష ఎంపీగా చూసేందుకు ఆయన కామెంట్స్ కి విలువ లేకుండా చేసేందుకు ఉపయోగపడుతుంది. మరి ఇకనైనా ఆ అస్త్రం తీస్తారా. ఇప్పటికే రఘురామ ఎపిసోడ్ లో వైసీపీ టోటల్ పరువు అయితే పోయింది.
నిజానికి వైసీపీ మీద వ్యతిరేకత ఆదిలో పెంచిందే రఘురామ. ఆయనతో పాటు ఇపుడు విపక్షాలు తోడు అయ్యాయి. మరి రాజు గారు ఇపుడు మాంచి రైజింగ్ లో ఉన్నారు. పార్టీలో ఉంచినా బయటకు పంపించినా ఆయన ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు. ఇదంతా వైసీపీ స్వయంకృతం అనే చెప్పాలి.