ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకోనున్నాయా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఢిల్లీలో ప్రస్తుతం పర్యటిస్తున్న టీడీపీ నేత చంద్రబాబు నాయుడు వేగంగా పావులు కదిపే పనిలో ఉన్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎంపీలతో పాటు వైసీపీ ఎంపీ రఘురామకృష్‌నరాజు కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నారు. ఈ సరికొత్త ఎత్తుగడతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ను వైసీపీ నేతలను పూర్తీ డిఫెన్సులో పడేయాలని చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు ఢిల్లీ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది.
ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లి విపక్ష నేత చంద్రబాబు అక్కడ రాజకీయ ఎత్తుగడల జోరు పెంచారు. వైసీపీ నేతలు ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి టీడీపీని డిఫెన్సులో పడే కార్యక్రమాలు జోరుగా చేపడుతున్నారు. దీంతో వైసీపీ వ్యూహాలకు చెక్‌పెట్టి, జగన్ సహా ఆ పార్టీ నేతలంతా ఆత్మరక్షణలో పడిపోయేలా చంద్రబాబు చాణక్యం ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ వేదికగా ఆయన వ్యూహ రచన చేస్తున్నారు.
మూడు రాజధానుల అంశాన్ని వెనక్కు తెరమరుగు చేయడానికి చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా అంశాన్ని తెరముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. అనుకోవడమే కాదు ప్రత్యేకహోదా కోరుతూ టీడీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఢిల్లీలోని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో సోమవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ ఎంపీలందరితో సమావేశమై ఎంపీల రాజీనామా వ్యూహాన్ని వారిముందుంచారు. ఈ సమావేశానికి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణమ రాజు కూడా హాజరై సంచలనం సృష్టించారు. టీడీపీ ఎంపీల రాజీనామాతో పాటు తాను కూడా రాజీనామా చేస్తానని రఘురామకృష్ణ రాజు చంద్రబాబు తెలిపినట్లు సమాచారం.
ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలన్నా, జగన్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలన్నా టీడీపీ ఎంపీల రాజీనామా లాంటి సంచలన నిర్ణయం ఏదో ఒకటి తీసుకుంటనే టీడీపీకి లాభిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక హోదా అంశాన్ని మరో మారు తెరపైకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. అయితే టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే దాన్ని బీజేపీ ఎలా పరిగణిస్తుంది, తదుపరి సంభవించే పరిణామాలు ఏంటీ అనేవాటిపైన చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు.
ఎంపీలు రాజీనామా చేస్తే కలిగే ప్లస్ ఏంటీ మైనస్ ఏంటీ అనే అంశాలను బాగా చర్చించిన తరువాత టీడీపీ ఎంపీల రాజీనామా అంశంపై ఒక తుది నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ లోపు త్వరలో జరగబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా లేవనెత్తాలని ఆయన ఎంపీలకు సూచించారు. ఇలా ఉండగం చంద్రబాబుతో సమావేం తరువాత తాను కూడా ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు రఘురామకృష్ణ రాజు ప్రకటించడం కొసమెరుపు
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.