తాడేపల్లిలో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేను కొట్టేంత ధైర్యం ఎవరికి ఉంటుంది?
ఏపీ రాజకీయాల్లో తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు పొలిటికల్ ఆర్ఆర్ఆర్ అలియాస్ నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘరామ క్రిష్ణంరాజు. దేశ రాజధాని ఢిల్లీలో తరచూ రచ్చబండ పేరుతో మీడియాకు వీడియో క్లిప్పుల్ని విడుదల చేసే ఆయన.. అప్పుడప్పుడు కొన్ని యూట్యూబ్ చానళ్లతో మాట్లాడుతుంటారు. ఈ సందర్భంగా తనకు తెలిసిన విషయాల్ని చెబుతుంటారు. ఆయన చెప్పే మాటల్లో చాలావరకు పత్రికల్లో కవర్ కానివే ఉంటాయి. లోగుట్టు అంశాల్ని.. తెర వెనుక ఫలానా జరిగిందట.. అని చెబుతూ తనకు అందిన విశ్వసనీయ సమాచారమంటూ ఆయన చేసే వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంటాయి.
తాజాగా అలాంటి మాట ఒకటి రఘురామ నోటి నుంచి వచ్చింది. ఒక చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేను కొట్టారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి తనకు పక్కా సమాచారం ఉందని చెబుతున్నారు. అయితే.. ఇంతకుమించి తాను ఎలాంటి వివరాల్ని ఇవ్వలేనన్నారు. మరోవైపు.. ఇదే ఉదంతానికి సంబంధించి ఆయన ఇంకో చానల్ తో మాట్లాడిన సందర్భంలో.. బేస్ బాల్ బ్యాట్ తో కొట్టారట.. ఆ సందర్భంలో ఆ ఎమ్మెల్యేకళ్లజోడు విరిగిందని.. పెదవి వాచినట్లు తనకు చెప్పారన్నారు.
తాడేపల్లిలో లోపలకువెళ్లినప్పుడుఅన్నీ బాగానే ఉన్నాయని.. మీటింగ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం.. కళ్లజోడు విరిగిందని.. పెదవి వాచిందని.. లోపల ఏం జరిగిందో తనకు మాత్రం తెలీదంటూ తన మార్క్ మాడ్యులేషన్ లో మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేను ఎవరు కొట్టారు? అంటే మాత్రం.. తనకు తెలీదన్నారు. దెబ్బలు తిన్న ఆ ఎమ్మెల్యే పేరును తాను చెప్పలేనని.. అంతేకాదు.. కొట్టిన వాళ్లు ఎవరో కూడా తాను చెప్పలేనన్నారు.
''తాడేపల్లిలో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేను కొట్టేంత ధైర్యం ఎవరికి ఉంటుంది? మీరే ఊహించుకోండి. నేను మాత్రం పేర్లు చెప్పను. కానీ.. నేను చెప్పేవన్నీ నూటికి నూరుపాళ్లు నిజం'' అని వ్యాఖ్యానించటం గమనార్హం. ఒక కానిస్టేబుల్ తనను తేలిగ్గా కొట్టగలడని.. కానీ.. తాడేపల్లిలో అధికార పార్టీ ఎమ్మెల్యేను కొట్టటం అంత తేలికైన విషయం కాదన్నారు. ఇంతకు మించి.. ఈ విషయం మీద తానుమాట్లాడలేనని చెప్పారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరిని తాడేపల్లిలో కొట్టారంటూ ఎంపీ రఘురామ రాజు చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ఇప్పటికే హాట్ న్యూస్ గా మారిన పొలిటికల్ 'ఆర్ఆర్ఆర్'.. తాజా వ్యాఖ్యతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. చూస్తుంటే.. ఈ అంశం రానున్న రోజుల్లో మరింత రచ్చ చేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.