ఏపీ సీఎం జగన్ తో కయ్యానికి కాలుదువ్వి రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన రఘురామ సుప్రీంకోర్టుకెళ్లి మరీ బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే కేసు గురించి మీడియాలో, సోషల్ మీడియాలో మాట్లాడవద్దని.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో దాదాపు 15రోజుల పాటు సోషల్ మీడియాకు, మీడియాకు దూరంగా ఉండిపోయారు.
రాజద్రోహం కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో ఇన్నాళ్లు మౌనం దాల్చారు. దీంతో రఘురామ నోటికి తాళం వేసినట్టేనని.. ఇక సీఎం జగన్ దే ఆధిపత్యం అని అందరూ భావించారు.
తాజాగా రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకు బెయిల్ తర్వాత మొట్టమొదటి సారి ఒక వీడియోతో బయటకు వచ్చారు. తొలిసారి స్పందించారు. తన విడుదల కోసం.. తన క్షేమం కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు చెబుతూ మొదలుపెట్టారు. ఆ తర్వాత జగన్ బెయిల్ రద్దు కేసులో సీఎం జగన్ వేసిన కౌంటర్ గురించి స్పందించారు. జగన్ కౌంటర్ పేలవంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
బెయిల్ రద్దు పిటీషన్ దాఖలులో తనకు ఏ స్వార్థం లేదని.. ఖచ్చితంగా న్యాయం జరుగుందని భావిస్తున్నట్టుగా రఘురామ తెలిపారు. ఎప్పుడూ వీరావేశంతో ఊగిపోయినట్టు మాట్లాడే రఘురామ తాజా వీడియోలో ప్రశాంతచిత్తంగా.. వేదాంత ధోరణితో మాట్లాడారు. నా పోరాటం ప్రజల కోసం.. మీకోసం.. ఇందులో నా వ్యక్తిగత స్వార్థం లేదని తెలిపారు.
జగన్ బెయిల్ రద్దుపై రఘురామ మాట్లాడారు. బెయిల్ రద్దుపై విచారణ మూడు సార్లు వాయిదా పడ్డాక జగన్ కౌంటర్ దాఖలు చేశారని.. నాపై ఏడు ఎఫ్ఐఆర్ లు ఉన్న వ్యక్తి ఈ పిటీషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారని రఘురామ తెలిపారు. వారం రోజుల్లో తాను రీజాయిండర్ వేస్తానని.. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని.. భగవంతుడి విశ్వాసం ఉందని రఘురామ తెలిపారు.
ఇలా రఘురామ తన దూకుడు కట్టిపెట్టి పాయింట్ టు పాయింట్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకొని తాజా వీడియోలో స్పందించారు.