వైసీపీ రెబల్ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతకూ వెనక్కి తగ్గడం లేదు. నిన్న ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ పక్ష పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎంపీలతో స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. స్పీకర్ స్పందించకపోవడంతో విజయసాయిరెడ్డి అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దీన్ని రెబల్ ఎంపీ విజయసాయిరెడ్డి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. విజయసాయిరెడ్డిని చిక్కుల్లో పడేసే ఎత్తుగడ చేశారు. కీలక మలుపుతిప్పేలా చక్రం తిప్పారు.
వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ఎంపీ రఘురామను ఎలాగైనా సరే సస్పెండ్ చేయించేలా చూడాలని వైసీపీ ఎంపీలు ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పదే పదే లోక్ సభ స్పీకర్ ను కలిసి వినతులు చేస్తున్నారు.రఘురామపై వేటు వేయాలని కోరుతున్నారు. కానీ స్పీకర్ మాత్రం ప్రతీసారి దీనిపై సానుకూలంగా స్పందించకపోవడంతో వైసీపీ ఎంపీలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. గురువారం సాయంత్రం మరోసారి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఆ పార్టీ ఎంపీలు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఇటీవలే ఓ లేఖ కూడా రాశారు. తాజాగా నేరుగా వైసీపీ ఎంపీలు విజయసాయి, మిథున్ రెడ్డి, భరత్ లు స్పీకర్ ను మరోసారి కలిశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురామరాజు పాల్పడుతున్నారని మరిన్ని ఆధారాలను స్పీకర్ కు అందజేశారు. వెంటనే రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు.
స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రఘురామపై నిప్పులు చెరిగారు. వైసీపీ టికెట్ మీద గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన రఘురామపై ఫిర్యాదు చేశామని చెప్పారు. గతంలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలను స్పీకర్ కు మరోసారి అందించామని తెలిపారు. రఘురామ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరోసారి కోరామని చెప్పారు. దీనిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారని.. రఘురామపై వేటు వేస్తారంటూ మాట్లాడారు.
స్పీకర్ మాత్రం ఇప్పటికీ ఎంపీ రఘురామపై నిర్ణయం తీసుకోవడం లేదు. ఏడాది క్రితం నుంచి ఆయనపై అనర్హత వేటు పరిశీలన జరుగుతూనే ఉంది. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి రఘురామపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా స్పీకర్ నుంచి సరైన స్పందన రావడం లేదు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి దూకుడు వ్యాఖ్యలు చేశారు. రఘురామపై అనర్హత పిటీషన్ వేసి ఏడాది దాటిందని.. ఈ విషయంలో స్పీకర్ పక్షపాత ధోరణి కనబరుస్తున్నారని.. స్పీకర్ గనుక రఘురామపై చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్ లో ఆందోళన చేపడుతామని.. పార్లమెంట్ ను స్తంభింప చేస్తామని సాయి రెడ్డి హెచ్చరించారు. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చూస్తే రఘురామపై వేటు ఆలస్యం అయ్యేలానే కనిపిస్తోంది.
ఇక తనపై అనర్హతవేటు విషయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశించి ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను గర్హిస్తూ రెబల్ ఎంపీ రఘురామ అనూహ్య చర్యలకు దిగారు. స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంట్ సభా హక్కుల కమిటీ చైర్మన్ కు రఘురామ శుక్రవారం లేఖ రాశారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విజయసాయి అనడం అనైతికమని.. సభా కార్యక్రమాలను అడ్డుకుంటామనడం బెదిరింపులకు కిందకే వస్తుందన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు విజయసాయిరెడ్డిని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది.
స్పీకర్ ను విజయసాయిరెడ్డి బెదిరించే ప్రయత్నం చేశారని రఘురామ ఆరోపించారు. సాయిరెడ్డి గతంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యపైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఇప్పుడు లోక్ సభ స్పీకర్ పై బెదిరింపు ధోరణిలో మాట్లాడారని.. విజయసాయిరెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ లేఖలో కోరారు.
అయితే ఈ వ్యవహారంపై హక్కుల చైర్మన్, స్పీకర్ కార్యాలయం, సాయిరెడ్డి స్పందించాల్సి ఉంది. మొత్తానికి లేఖలతోనే వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతూ రఘురామ తెగ రచ్చ చేస్తున్నట్టు తెలుస్తోంది.