మొన్నటి వరకూ రఘువీరారెడ్డిపై సీబీఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ వాళ్లు డిమాండ్ చేసేశాళ్లు. మేఘమధనంతో సహా వివిధ వ్యవహారల్లో రఘువీరా బాగా సంపాదించాడని.. ఆయనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే అసలు విషయాలన్నీ వెలుగులోకి వస్తాయని వారు వ్యాఖ్యానించే వారు. అయితే ఇప్పుడు రఘువీరారెడ్డినే సీబీఐ అంటున్నాడు. నారా లోకేష్‌పై సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందేనని ఈయన డిమాండ్ చేస్తున్నాడు.
ప్రధానంగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అనే పాయింట్‌ను పట్టుకొన్నాడు రఘువీరారెడ్డి. ఈ ప్రోత్సహకాలకు గానూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి తనయుడికి బాగా ముట్టిందని రఘువీరారెడ్డి ఆరోపిస్తున్నాడు. తొలి రోజు ఈ ఆరోపణను చేసిన రఘువీరారెడ్డి ఇప్పుడు దాన్నే రిపీట్ చేస్తున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వ వ్యవహారాల్లో చాలా అవినీతి జరిగిపోతోందని.. 15,000 కోట్ల రూపాయల విడుదలలో ఐదువందల కోట్ల రూపాయల అవినీతి ఉందని.. ఏపీ ప్రభుత్వం కొంటున్న ప్రతియూనిట్ విద్యుత్‌లోనూ లోకేష్‌కు కమిషన్ దక్కుతోందని రఘువీరారెడ్డి ఆరోపిస్తున్నాడు. సీబీఐ విచారణ జరిపిస్తే కానీ అసలు విషయాలు వెలుగులోకి రావని రఘువీరారెడ్డి తేల్చేశాడు!
అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం రఘువీరుడి ఆరోపణలను పూర్తిగా లైట్ తీసుకొంటోంది. రఘువీరారెడ్డి అడ్రస్ లేని పార్టీకి నాయకుడిగా ఉన్నాడని.. ఆయన ఆరోపణలకు విలువనివ్వాల్సిన అవసరం లేదని వారు ఈ విధంగా చెబుతున్నారు.
మరి ఇప్పుడు రఘువీరారెడ్డి ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని.. తెలుగుదేశం పార్టీ ఆయనపై తాము గతంలో చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణను మొదలెట్టిస్తుందా? లేక లోకేష్ నిజాయితీ పరుడని నొక్కివక్కాణిస్తుందా?! వేచి చూడాలి!