ఆలూ చూలూ లేకుండానే కొడుకుపేరు సోమలింగం అని సామెత. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని అయ్యే వ్యవహారం కూడా ఈ సామెత చందంగానే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ.. ప్రత్యేక హోదా గురించి తమకు పోరాడే ఉద్దేశం సన్నగిల్లిపోయి ఉంటే , గౌరవంగా పోరాటం నుంచి పక్కకు తప్పుకోవచ్చు గానీ.. డొంకతిరుగుడు పలాయనవాదంతో వారు ప్రజల్ని బుకాయించడానికి ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ వారు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక హోదా కోసం సంతకాల సేకరణ అన్నప్పటికీ - వర్క్ షాప్ లు అన్నప్పటికీ ప్రజలనుంచి మాత్రం పెద్దగా స్పందన ఉండడం లేదు. ఏదో పార్టీ కార్యకర్తలు - నాయకులు ఓ మోస్తరుగా హాజరవుతున్నారే తప్ప.. ప్రజలనుంచి వారికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆదరణ పెరగడం లేదు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రఘువీరాకు విరక్తి పుట్టిందో ఏమో గానీ.. ప్రత్యేకహోదా పోరాటం విషయంలో దాదాపుగా కాడి పక్కన పారేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు.
ఇంతకూ ఆయన ఏం అంటున్నారో తెలుసా.. 2019లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే.. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేస్తారుట. విభజన చట్టం ద్వారా సంక్రమించాల్సిన సమస్తం ఇచ్చేస్తారుట. అయినా రఘువీరా మాటలు పలాయన వాదానికి పరాకాష్టలాగా ఉన్నాయి. అసలు పార్టీ బాధ్యతలు తీసుకోడానికే సుముఖంగా లేని రాహుల్ గాంధీ నాయకత్వాన్ని నమ్ముకుని మరో రెండేళ్లలోనే దేశవ్యాప్త ప్రజాదరణను రాబట్టగలమని వారు ఎలా ఆశిస్తున్నారో గానీ.. రాహుల్ ప్రధాని అయ్యాక ప్రత్యేకహోదా ఇప్పిస్తాం అని ప్రకటించడం అంటే.. వారు ఈ ఉద్యమాన్ని పక్కన పెట్టేసినట్లేనని ప్రజలు అనుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/