" కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి" ఇవి మాజీ రాష్ట్రపతి, దివంగత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం మాటలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రెండు జాతీయపార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇవే పని లో ఉన్నాయి. అయితే ఆ కలలని తమలోనే దాచుకోకుండా పైకి చెప్పేయడంతోనే ఇబ్బందులు వస్తున్నాయి. "పాపం వీరి కలలు నిజమవుతాయా. పోనీలే కాకపోయినా... కలాం గారు అన్నట్లు కలలైనా కంటారు" అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారిని వారు సముదాయించుకుంటన్నారు. ఇంతకీ విషయం ఏమిటీ అనుకుంటన్నారా. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 25 లోక్‌సభ స్ధానాల్లో విజయం సాధించి తీరతామని ప్రకటిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సొంతం గా గెలుచుకుంటుందని, లేకపోతే ఎవరో ఒకరి తో పొత్తు పెట్టుకు నైనా 25 స్ధానాలు గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు.
ఆంధ‌్రప్రదేశ్ లో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రఘువీరారెడ్డి ఈ ప్రకటన చేశారు. దీంతో ఈ ప్రకటన విన్న, చదివిన, టీవీల్లో చూసిన వారి దిమ్మ తిరిగిపోతోంది. రాష్ట్రాన్ని నిర్దయగా రెండుగా విభజించిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరో మూడు దశాబ్దాలు తర్వాత అధికారాన్ని కట్టపెడతారని, అంత వరకూ వారికి కలలే తప్ప వాస్తవాధికారం రాదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కి రానున్న ఎన్నికల్లో 25 లోక్‌సభ స్ధానాలు వస్తాయని కలలు కనడం వారి హక్కు అని, దాన్ని ఎవరూ కాదనలేరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
పోనీ అని అధికార తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఇన్ని స్ధానాలు సాధిస్తారని ఆశించినా తెలంగాణ ఫలితాలు చూసిన తర్వాత ఏ ఒక్కరి కి కాంగ్రెస్ పార్టీ కి, తెలుగుదేశం పార్టీ కి ప్రజలు పట్టం కట్టరని తేలిపోయిందంటున్నారు. అధికారం రాకపోయినా కలల్లో కాంగ్రెస్ పార్టీ... ఊహల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అనుభవించడం ఎవరు ఆపలేరు కదా అని రాజకీయ పండితులు అంటున్నారు. మరో మూడు నాలుగు నెలల వరకూఈ కలలు, ఊహలకు ఆ రెండు పార్టీలను దూరం చేయకూడదంటున్నారు.