ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతున్నప్పటికీ అతడే ఒక సైన్యం అనే రీతిలో ఒంటరిపోరాటం చేస్తున్న ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి తమిళుల సంప్రదాయమైన జల్లికట్టు తెగ నచ్చేసిందట. అదేంటి తెలుగు వారి సంప్రదాయ ఆట కోడి పందాల కంటే జల్లికట్టులో ఏం స్పెషాలిటీ ఉందనుకుంటున్నారా? రఘువీరారెడ్డికి ఆట కోణంలో కాకుండా జల్లికట్టుకు అనుమతి విషయంలో తమిళుల స్పూర్తి నచ్చేసిందట. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి తమిళులను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు ప్రజలందరూ ఐక్యం కావాలని రఘువీరా పిలుపునిచ్చారు.
తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయంగా నిర్వహించే జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం ప్రకటించడంతో అక్కడి రాజకీయ పార్టీలు - సినిమా రంగం - ప్రజలు ఐకమత్యంగా పోరాటం చేసి కేంద్రపై ఒత్తిడి చేసి కేవలం మూడు రోజుల్లో ఆర్డినెన్స్ తెచ్చుకోగలగడం గొప్ప విషయమని రఘువీరా తెలిపారు. ఈ జల్లికట్టు వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదని అయినప్పటికీ వారు పోరాట స్పూర్తి ప్రదర్శించారన్నారు. అయితే ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేస్తే నేటికీ కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదని రఘువీరా విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేస్తోందని రఘువీరారెడ్డి ఈ సందర్భంగా వివరించారు. ఇప్పటికే ప్రజాబ్యాలెట్ ద్వారా అభిప్రాయాలు సేకరించగా 99 శాతం మంది ప్రత్యేకహోదా ఎంతో అవసరమని ఓటింగ్ చేశారన్నారు. ప్రజల ఆకాంక్షలు దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు - ప్రజాసంఘాలు తమిళులను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. వీరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం వహించాలని రఘువీరా రెడ్డి సూచించారు. హోదా సాధిస్తే రాష్ట్రానికి విరివిగా నిధులు - పరిశ్రమలు వస్తాయని - తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ విషయంలో తెలుగు ప్రజలందరూ ఐక్యంగా కలసి కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/