ర‌ఘువీరా..చంద్ర‌బాబుకు బాగా గ‌డ్డిపెట్టారు

Update: 2018-10-31 05:57 GMT
విభ‌జ‌న వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు జ‌రిగిన న‌ష్టం ఎవ్వ‌రూ పూడ్చ‌లేనిది. దీనివ‌ల్ల ఏపీ ఆస్తుల‌తో పాటు అవ‌కాశాల‌ను, భావి త‌రాల‌కు బంగారు భ‌విష్య‌త్తును కోల్పోయింది. ఈ పాపం మొత్తం కాంగ్రెస్ పార్టీదే. దానికి ప్ర‌తీకారంగా ఆ పార్టీకి భారీ శిక్ష వేశారు ఏపీ ప్ర‌జ‌లు. చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ లేన‌ట్లు కాంగ్రెస్‌ ను 2014 ఎన్నిక‌ల్లో దెబ్బ‌కొట్టారు. ఒక్క ఎమ్మెల్యేను కూడా వారు గెలిపించ‌లేదు. దీంతో అటు తెలంగాణ అధికారం రాక‌పోగా - ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయ్యింది. త‌ప్పు తెలుసుకున్న కాంగ్రెస్ చేతిలో ఏమీ లేకుండా పోయింది. దీంతో ఎలాగైనా ఏపీలో నిల‌బ‌డాల‌ని కాంగ్రెస్ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది.  చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోవ‌డం లేదు.

నిన్న క‌డ‌ప‌లో చంద్ర‌బాబు ధ‌ర్మ పోరాట స‌భ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అనేక విష‌యాల‌పై చంద్ర‌బాబు స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఏపీకి న‌ష్టం జ‌రిగే ఓ మాట‌ను అనేశారు. అది ఆయ‌న కేవ‌లం త‌న ఇగో చ‌ల్లార్చుకోవ‌డం కోసం చేసిన వ్యాఖ్యే. కానీ దానివ‌ల్ల ఏపీకి భారీ న‌ష్టం క‌లిగే ప్ర‌మాదం ఉంది. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ ఏపీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా క‌నిపెట్టారు. దానిపై చంద్ర‌బాబును నిల‌దీశారు. ఆయ‌న త‌ప్పును ఎత్తిచూపారు.

ఇంత‌కీ నిన్న చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే రాయలసీమలోని క‌డ‌ప‌లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయ‌మ‌ని ఎన్డీయేను డిమాండ్ చేస్తున్నాం. ఒక‌వేళ వారు ఇవ్వ‌క‌పోతే ర‌ప్పించుకుంటాం. అదీ జ‌ర‌గ‌క‌పోతే  రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్మిస్తామని చంద్ర‌బాబు చెప్పారు. దీనిపై ర‌ఘువీరా స్పందించారు. క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ విభజన హామీలలో చట్టబద్ధమైన హక్కు అని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. కేంద్ర నిధులతోనే కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్మిస్తామని చంద్రబాబు చెప్పడం తమహక్కును కేంద్రానికి వదులు కోవడమే అని... దానివ‌ల్ల‌ రాష్ట్ర ప్రభుత్వంపై మరింత భారం పడుతుందని రఘువీరా పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు  తీర‌ని చేటు చేస్తుంద‌ని.. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాజెక్టు అన్నారు. 40 ఏళ్ల అనుభ‌వం ఉంద‌ని చెప్పే చంద్ర‌బాబు ఇలాంటి విష‌యాలు మాట్లాడిన‌పుడు ఆయ‌న అనుభ‌వం ఏమ‌వుతుందో మ‌రి!
   

Tags:    

Similar News