2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించిపెట్టడమే లక్ష్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 3,500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తున్నారు. తమిళనాడులోని త్రివేణి సంగమం అయిన కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం తమిళనాడులో టూరు ముగించుకున్న రాహుల్ పాదయాత్ర కేరళ చేరుకుంది.
కేరళలో 18 రోజులు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు రోజుల పాదయాత్రను కేరళలో పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం కేరళలోని అట్టింగల్ లో రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది.
దీంతో రాహుల్ గాంధీ పాదయాత్రకు వివిధ వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాహుల్ కూడా ఎక్కడికక్కడ తన పాదయాత్రలో మహిళా కూలీలు, వలస కూలీలు, రైతులు, విద్యార్థులు, మైనారిటీలు, వృద్ధులు, ఉద్యోగులు, యువకులు ఇలా అన్ని వర్గాల వారితో ముచ్చటిస్తున్నారు. దేశ పరిస్థితులను వారితో చర్చిస్తున్నారు. కొన్ని విషయాలను వారినడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తాజాగా వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ప్రధాని మోడీ చైనాకు అప్పగించారంటూ రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 2020కి ముందున్న స్టేటస్‌కో (యథాతథ స్థితి)ను కొనసాగించేందుకు చైనా తిరస్కరించిందని పేర్కొన్నారు. అయినా మోడీ ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టడం లేదని రాహుల్ మండిపడ్డారు. ఈ వెయ్యి కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారో..మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఏప్రిల్ 2020 నాటి యథాతథ స్థితిని పునరుద్ధరించాలన్న భారత్ డిమాండ్‌ను అంగీకరించేందుకు చైనా నిరాకరించింది. ప్రధాని చైనాకు 1000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఎలాంటి పోరాటం లేకుండా ఇచ్చారు. ఈ భూభాగాన్ని ఎలా తిరిగి పొందుతారో కేంద్ర ప్రభుత్వం వివరించగలదా? అని రాహుల్ ట్వీట్ చేశారు.
మరోవైపు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తుతుంటే వాటికి సమాధానాలు చెప్పకుండా బీజేపీ నేతలు ఆయనపై ఎదురుదాడి చేస్తున్నారు. రాహుల్ గాంధీ దుస్తులపైన కొద్ది రోజుల క్రితం రచ్చ చేశారు. ఇప్పుడు ఆయన పాదయాత్రలో పిల్లలు పాల్గొంటున్నారని జాతీయ బాలల హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మొదట రాహుల్ గాంధీ పాదయాత్రను పూచిక పుల్లలా తీసేసిన బీజేపీ నేతలు రోజురోజుకీ యాత్రకు మంచి ఆదరణ లభిస్తుండటంతో తట్టుకోలేకపోతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.