ఈసీ నిర్ణయంతో బోగస్ కి చెక్ పడుతుందా ?
ఒక ఓటు ఎవరికైనా ఉండడమే రాజ్యాంగం ప్రవచించిన సిద్ధాంతం. అర్హత కలిగిన పౌరుడికి ఒక్క ఓటే ఇస్తారు.;
ఒక ఓటు ఎవరికైనా ఉండడమే రాజ్యాంగం ప్రవచించిన సిద్ధాంతం. అర్హత కలిగిన పౌరుడికి ఒక్క ఓటే ఇస్తారు. అది ఎంత పెద్ద వారు అయినా ఎంత పెద్ద పదవులలో ఉన్న వారు అయినా ఒక్కటే ఓటు. కానీ కొన్ని లొసుగులను తెలుసుకుని ఈ రోజుకీ అక్కడో ఓటూ ఇక్కడో ఓటూ వేసేవారు ఉన్నారు.
సొంతూరు పొన్నూరులలో ఓటర్ కార్డులను తీసుకుని ఓట్లు వేసే వారూ ఉన్నారు. ఒక రాష్ట్రంలో ఓటేశాక తిరిగి తమ సొంత రాష్ట్రానికి వచ్చే వారూ ఉన్నారు. ఇలాంటి వాటికి ఇప్పటిదాకా చెక్ పెట్టే చాన్సే లేకుండా పోయింది.
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్న తీరున అక్రమార్కులు చేసుకుంటూ పోతున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటరు కార్డుతో ఆధార్ కార్డుని అనుసంధానం చేయడమే ఆ నిర్ణయం.
ఇది చాలా కాలంగా చేస్తూ వస్తున్న డిమాండ్. ఇపుడు ఈసీ దీని మీద సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 326 ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 మేరకు అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈపీఐసీకి ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.
ఈ కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ ఈసీలు డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషీ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ఉడాయ్ కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సాంకేతిక ప్రతినిధులు ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ లో భేటీ అయ్యారు. ఇక తొందరలోనే దీనిని సంబంధించి ఉడాయ్ కేంద్ర ఎన్నికల సంఘం నిపుణుల పట్ల సాంకేతిక పరమైన చర్చలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది.
ఇక చూస్తే కనుక భారత రాజ్యాంగంలోకి ఆర్టికల్ 326 ప్రకారం ఈ దేశంలో భారత పౌరుడికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది అన్నది తెలిసిందే. ఆధార్ కార్డు అన్నది ఒక వ్యక్తికి ఈ దేశంలో గుర్తింపు ఇస్తూ విశిష్టమైన నంబర్ ని కేటాయిస్తుంది.
ఇక చూస్తే ఓటరు కార్డుకు ఆధార్ కార్డుని అనుసంధానం చేయడం అన్నది కూడా సమంజసమైన రాజ్యాంగపరమైన నిర్ణయంగానే ఉంటుంది అని అంటున్నారు అదెలా అంటే రాజ్యాంగంలోకి ఆర్టికల్ 326 ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 లోని సెక్షన్ 23(4), 23 (5), 23(6) నిబంధనలను అనుసరిస్తూనే సుప్రీం కోర్టు తీర్పుని కూడా స్పూర్తిగా తీసుకుని ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉడయ్ కేంద్ర ఎన్నికల సంఘం కలసి రానున్న కాలమలో భోగస్ ఓట్లకు చెక్ పెట్టనున్నారు. అదే జరిగితే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువుని అందించినట్లు అవుతుందని ప్రజాస్వామ్య ప్రియులు అంటున్నారు.