మోడీపై తిట్టు బాగుంది. కానీ లోపం అదే రాహుల్ జీ?

Update: 2018-09-21 05:40 GMT
మీలో ఒక లోపం ఉంది. దాన్ని ఎత్తి చూపిస్తూ.. మీ ప్ర‌త్య‌ర్థులు త‌ర‌చూ వేలెత్తి చూపిస్తుంటారు. అందుకు ఒక ప‌దాన్ని వాడుతున్నార‌నుకోండి.. వారిపై ఎదురుదాడి చేసేందుకు అదే ప‌దాన్ని కాస్త కాపీ కొట్టేసి వాడేస్తే బాగుంటుందా?  దాంతో లాభ‌మా?  న‌ష్ట‌మా? అన్నది ఇప్పుడు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌గా మారింది.

అప్పుడెప్పుడో దేశంలో సంచ‌ల‌నం సృష్టించిన బోఫోర్సు స్కాంను ఉద్దేశించి అప్ప‌టి విప‌క్షాలు దివంగ‌త రాజీవ్ ను ఉద్దేశిస్తూ భారీ ఎత్తున స్లోగన్లు ఇచ్చేవారు. అలాంటి వాటిల్లో గ‌లీ గ‌లీ మే షోర్ హై.. రాజీవ్ గాంధీ చోర్ హై నినాదం చాలామంది నోట్లో విప‌రీతంగా నానింది. రాజీవ్ గాంధీని ప‌ద‌వీచ్యుతుడ్ని చేయ‌ట‌మే కాదు.. కాంగ్రెస్ పార్టీ ఎప్ప‌టికి త‌న మీద ప‌డిన మ‌ర‌క‌ను తుడుచుకోలేని విధంగా మార్చింది.

ద‌శాబ్దాలు గ‌డిచినా.. కాంగ్రెస్ ను ఎవ‌రైనా విమ‌ర్శించాల‌ని డిసైడ్ అయితే.. వారి నోటి నుంచి వ‌చ్చే తొలిమాట బోఫోర్సు స్కాం గురించే. ఇప్ప‌టికీ దేశ ప్ర‌జ‌ల మ‌దిని వీడ‌ని ఈ కుంభ‌కోణంపై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌తో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మోడీ స‌ర్కారుపై రాఫెల్ స్కాం వివాదం చుట్టిముట్టింది. ఈ ఉదంతంలో మోడీ స‌ర్కారుపై సంధిస్తున్న సందేహాల్ని మోడీ అండ్ కో సంతృప్తిక‌రంగా వాద‌న‌లు వివ‌రించ‌టం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఇలాంటివేళ‌.. మోడీ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతూ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కొత్త‌గా ఒక నినాదాన్ని తెర మీద‌కు తెచ్చారు. అయితే.. ఈ నినాదం గ‌తంలో త‌న తండ్రిని బోఫోర్సు కుంభ‌కోణం సంద‌ర్భంగా త‌మ‌పై విరుచుకుప‌డేందుకు వాడిందే కావ‌టం విశేషం. గ‌లీగ‌లీమే షోర్ హై.. రాజీవ్ గాంధీ చోర్ హై నినాదాన్ని కాస్త మార్చి.. గ‌లీ గ‌లీ మే షోర్ హై..హిందూస్థాన్ కా చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ నోటి నుంచి వ‌చ్చిన నినాదం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

రాఫెల్ డీల్ విష‌యంలో టార్గెట్ గా మారిన మోడీని ఉద్దేశించి రాజ‌స్థాన్ లోని దంగార్పూర్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ మాట్లాడుతూ.. ఈ నినాదాన్ని వినిపించారు. దేశానికి కాప‌లాదారుగా దేశ ఆస్తిని కాపాడ‌తాన‌ని మూడేళ్ల క్రితం మోడీ అన్న మాట‌ల్ని త‌మ‌కు అనువుగా తీసుకున్న రాహుల్ మోడీపై స‌రికొత్త ఎదురుదాడికి తెర తీశారు.

కాపీ కొట్టినా.. మోడీని డిపెన్స్ లో ప‌డేసేందుకు వీలుగా ఉన్న ఈ నినాదం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. అంతా ఓకే కానీ.. ఒక్క‌టే డౌట్‌. త‌న కాపీ నినాదంతో త‌న తండ్రి మీద ఉన్న బోఫోర్స్ మ‌ర‌క‌ను గుర్తుకు తేవ‌టం ద్వారా లాభం ఉందంటారా?  గ‌తాన్ని గుర్తుకు తెచ్చి మ‌రీ.. తాను.. మోడీకి మ‌ధ్య పెద్ద తేడా ఏమీ లేద‌న్న విష‌యాన్ని చెప్ప‌టం ద్వారా రాహుల్‌కు వ‌చ్చే ప్ర‌త్యేక లాభం ఏమిటంటారు..?
Tags:    

Similar News