నేతలంతా ఒక్కలా ఉండరు. అందునా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల తీరు కాస్త భిన్నం. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ లో తమకు తోచినట్లుగా మాట్లాడే అలవాటు ఎక్కువే. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయం నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేసిన వైనం తెలిసిందే.
అయితే.. రాహుల్ రాజీనామాను కాంగ్రెస్ నేతలంతా వ్యతిరేకించారు. ఆయన్ను బుజ్జగించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా.. రాహుల్ వెనక్కి తగ్గట్లేదు. ఈ బుజ్జగింపులు.. ఇతరత్రా కార్యక్రమాలు నచ్చలేదో ఏమో కానీ.. సీనియర్ నేత వీరప్ప మొయిలీ కాస్త భిన్నంగా వ్యవహరించారు.
రాహుల్ ఆలోచన సరైనదేనని.. ఆయన అధ్యక్ష పదవి నుంచి వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాకుంటే.. పార్టీకి నూతన రథసారథిని ఎంపిక చేసిన తర్వాతే ఆయన తన రాజీనామా ప్రక్రియను పూర్తి చేయాలని వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ ఆలోచన సరైనదేనని.. ఆయన వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటే వెళ్లొచ్చు.కాకుంటే.. పార్టీకి నూతన సారథిని వెతికిపెట్టిన తర్వాతే ఆయన ఆ పని చేయాలి. ప్రస్తుతం పార్టీ సంక్షోభ స్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడంటే కేవలం పార్టీ బాధ్యతలే కాదు.. ఇది జాతీయ బాధ్యతగా ఆయన అభివర్ణించారు. అందిరిలా మాట్లాడకుండా.. భిన్నంగా మాట్లాడటం ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్న వీరప్ప మొయిలీ వ్యాఖ్యలపై రాహుల్ ఎలా స్పందిస్తారో చూడాలి.