మ‌ళ్లీ క‌న్ను కొట్టిన రాహుల్‌...ర‌చ్చ‌లో ఇదో స్పెష‌ల్‌

Update: 2019-01-04 14:56 GMT
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మ‌రోమారు త‌న చిత్ర‌మైన ప్ర‌వ‌ర్త‌నతో ఆక‌ట్టుకున్నారు. కొద్దికాలం క్రితం లోక్‌సభలో ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీని పార్ల‌మెంటు వేదిక‌గా కౌగిలించుకొని, తర్వాత కన్నుకొట్టడం ఎంత దుమారం రేపిందో మనకు తెలుసు. ఆ వివాదం ఇంకా సద్దుమణగనే లేదు.. రాహుల్ మరోసారి కన్నుకొట్టారు. పార్లమెంటులోని లోక్ సభలో రాఫెల్ వివాదంపై డిబేట్ జరుగుతున్న సమయంలో రాహుల్ పార్టీ నేత జోతిరాధిత్య సిసోడియా వైపు చూస్తూ ఇలా కన్నుగీటారు.

ఆరు నెలల క్రితం పార్లమెంటులో  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్నుగీటిన వీడియో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. తాజాగా మ‌ళ్లీ అదే ఘ‌ట‌న చోటుచేసుకుంది. అన్నాడీఎంకే ఎంపీ - డిప్యూటీ స్పీకర్ ఎం థంబి దురాయ్ డిబేట్ లో భాగంగా చర్చిస్తుండగా.. సిసోడియా పక్కనే కూర్చొన్న రాహుల్ గాంధీ కన్నుగీటడం మళ్లీ చర్చకు దారితీసింది. వీడియో వైర‌ల్ అయింది.


Full View

Tags:    

Similar News