హోరాహోరీగా సాగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు ముగిసి ప్రభుత్వాలు ఏర్పడటం, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, పార్టీ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాస్త రిలాక్స్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రస్తుతం గోవా విహారయాత్రకు వచ్చారు. తన తల్లి సోనియా గాంధీతో కలిసి ఆదివారం గోవా టూర్ వచ్చారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది లేకుండా సాధారణ పర్యాటకుడిలాగా గోవా తీరంలో ఎంజాయ్ చేస్తున్న రాహుల్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాహుల్, సోనియా మూడో రోజుల గోవా టూర్ కు వచ్చారు. సౌత్ గోవాలో సీఫుడ్ కు పేరుగాంచిన వార్ఫ్ రెస్టారెంట్ కు సోనియాతో కలిసి రాహుల్ లంచ్ చేశాడు. ఈ సందర్భంగా అక్కడివచ్చిన కొంతమంది పర్యాటకులు రాహుల్ తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. గోవాకు చెందిన ఫేమస్ డెంటిస్ట్ రచనా ఫెర్నాండెజ్ తన బంధువులతో కలిసి అదే రెస్టారెంట్ కు భోజనం చేసేందుకు వచ్చింది. అక్కడా రాహుల్ కనబడటంతో అతనితో సెల్ఫీ దిగి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. మీతో(రాహుల్) ఫొటో దిగాలని ఉందని నేను అడగ్గానే.. బిల్లు కట్టి వచ్చిన తర్వాత సెల్ఫీ దిగుతానని తనతో రాహుల్ చెప్పారని ఫెర్నాండెజ్ తెలిపారు.