కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సహజశైలికి భిన్నమైన పనికి చెందిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఇంతకూ ఏం చేశారు..ఎందుకు ఆయన ఫోటోలకు సోషల్ మీడియా ఆ రీతిలో స్పందిస్తోందంటే...ఆయన ఓ విమానంలో సామాన్లు సర్దుతున్న ఫొటోలు. అందుకే సోషల్ మీడియా అలా స్పందించేసింది.
ఇంతకీ విషయం ఏంటంటే..ఢిల్లీ నుంచి గువాహటి వెళ్తున్న విమానం అది. ఆ సామాన్లు ఆయనవే అయితే ఇది పెద్ద వార్త కాదేమో. కానీ తోటి ప్రయాణికుల సామాన్లను పైన ఉన్న క్యాబిన్ లో పెట్టడానికి రాహుల్ సాయం చేశారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్గా మారిపోయాయి. ఆయన లగేజ్ సర్దుతుండగానే మరికొందరు సెల్ఫీలు దిగారు. గతేడాది డిసెంబర్ లోనూ ఇలాగే అహ్మదాబాద్ వెళ్లడం కోసం వచ్చిన రాహుల్.. మిగతా ప్రయాణికులతో కలిసి బోర్డింగ్ కోసం క్యూలో నిలబడిన ఫొటోలు కూడా వైరల్గా మారిన విషయం తెలిసిందే.