ప్ర‌ణ‌బ్‌ పై రాహుల్ ఇచ్చిన తొలిషాక్ ఇదేన‌ట‌

Update: 2018-06-11 17:09 GMT
సిద్ధాంత‌ప‌రంగా బ‌ద్ధ‌శ‌త్రువు అయిన రాష్ర్టీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ స‌మావేశానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీపై ఆ పార్టీ ప‌గ తీర్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మేర‌కు తొలి అడుగు వేశార‌ని అంటున్నారు. ఏకంగా కీల‌క స‌మావేశం వేదిక‌గా ఆయ‌న షాకిచ్చారు. ఈ నెల 13న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ వేదికగా రాహుల్ గాంధీ ఇఫ్తార్ విందు ఇవ్వబోతున్నారు. ఈ విందుకు ఏర్పాట్లు చకచక సాగిపోతున్నాయి. ఇప్పటికే ఆయా ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపిన రాహుల్ గాంధీ.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మాత్రం ఆహ్వానం అందించ‌లేదు.

కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల తర్వాత ఇఫ్తార్ విందు ఇస్తోంది.ఈ విందుకు వివిధ పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. 2015లో కాంగ్రెస్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు సోనియాగాంధీ ఆతిథ్యం ఇవ్వ‌గా  తాజాగా ఇస్తున్న ఈ విందు ప్రాధాన్యత సంతరించుకుంది.  అయితే ఈ భేటీకి - ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ తో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి ఆహ్వానం పంపలేదని సమాచారం. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసింది. కాగా, నాగపూర్ లో ఇటీవల నిర్వహించిన ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరుకావద్దంటూ ప్రణబ్ కూతురు సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు సూచించారు. అయినప్పటికీ ప్రణబ్ హాజరయ్యారైన విషయం తెలిసిందే.

కాగా, తల్‌ కటోరా స్టేడియంలో ఓబీసీ శాఖకు చెందిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ బీజేపీ - ఆర్ ఎస్ ఎస్‌ కు చెందిన ముగ్గురు నలుగురు చేతుల్లో భారత్ బానిసగా మారిందనిఅన్నారు. ఇద్దరు ముగ్గురి చేతుల్లో దేశం నడవదన్న విషయం వాళ్లు త్వరలోనే తెలుసుకుంటారని రాహుల్ అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై సమర్థవంతంగా బీజేపీ - ఆర్ ఎస్ ఎస్‌ ను ఎదుర్కొంటాయన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ - లాలూ ప్రసాద్ యాదవ్‌ లు ఇప్పుడు దూరం అయ్యారు. ఒకప్పుడు వాళ్లే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఓటు బ్యాంక్‌ గా ఉండేవారు. దేశజనాభాలో ఓబీసీలు 52 శాతం ఉన్నారు. అయితే ఓబీసీ ఓటర్లను మచ్చిక చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. మోడీ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయడం లేదని, కానీ వ్యాపారవేత్తలకు మాత్రం రుణమాఫీ కల్పిస్తోందని రాహుల్ ఆ సమావేశంలో విమర్శించారు.

Tags:    

Similar News