సుదీర్ఘకాలంగా చర్చల్లో నలుగుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పార్టీ రథసారథి బాధ్యతల అప్పగింత అనే ఎపిసోడ్ కు త్వరలో ఫుల్ స్టాప్ పడనుంది. ఆయన కు పట్టం కట్టేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో రాహుల్ ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును ఖరారు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ లోగా పూర్తి చేయాల్సిఉంది. లేదంటే పార్టీ గుర్తింపు, ఎన్నికల చిహ్నాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసే ప్రమాదం ఉంది. అందుకే కాంగ్రెస్ అధినాయకత్వం వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసేందుకు మంగళవారం పార్టీ ఎన్నికల షెడ్యూలును సిద్ధం చేసింది.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఖరారు చేసిన ప్రక్రియ ప్రకారం అక్టోబర్ లో రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. దీంతోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కొత్త సభ్యులనూ ఎన్నుకుంటారు. దీనికోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెలాఖరు నుంచి కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. గ్రామస్థాయి నుంచి మండల - జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు - ఏఐసిసి సభ్యులు - పిసిసి సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. కాంగ్రెస్ సభ్యత్వ కార్యక్రమం నెలాఖరుకు ముగుస్తుంది. ఇది ముగిసిన వెంటనే సంస్థాగత ఎన్నికల కార్యక్రమాన్ని అమలు చేస్తారు. వీలైనంత వరకు సంస్థాగత ఎన్నికలను ఏకాభిప్రాయంతో ముగించేలా హైకమాండ్ పావులు కదుపుతోంది. ఎక్కువమంది సభ్యులను చేర్చినవారికి పదవులు లభించనున్నాయి. అయితే పలు రాష్ట్రాల్లో ఆశించినస్థాయిలో సభ్యత్వ నమోదు జరగలేదని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా యువనేత విషయంలో ఇక వేచి చూసే దోరణిలో ఉండబోరని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/