మారిన రాజకీయ ముఖచిత్రమో.. మరింకేమైనా కారణమో తెలీదు కానీ ఉన్నట్లుండి కాంగ్రెస్ యువరాజు కమ్ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నోటి నుంచి చిత్రమైన మాటలు వస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రదర్శించని ప్రేమాభిమానాల్ని తమిళ ప్రజల మీదా.. తమిళప్రాంతం మీద పొంగిస్తున్నారు. అదేమంటే.. తాను ఇక మీదట తమిళ సినిమాలు చూస్తానని.. తమిళ ప్రజల సంస్కృతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తానని.. తమిళ పుస్తకాల్ని చదువుతానని చెప్పారు.
తమిళనాడు కాంగ్రెస్ నేతలతో తాజాగా భేటీ అయిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర ముచ్చట్లను చెప్పుకొచ్చారు. తమిళంపైనా.. తమిళ ప్రజల మీద ఉన్న తనకున్న ఫీలింగ్స్‌ను తన సోదరి ప్రియాంకకు మెసేజ్ చేశానని.. తాను కూడా అలాంటి భావనలోనే ఉన్నట్లుగా ఆమె చెప్పినట్లుగా చెప్పారు.
ఎందుకో తెలీదు కానీ తమిళనాడు వెళ్లటం అంటే తనకెంతో ఇష్టంగా ఉంటుందని.. తమిళ ప్రజలతో తనకు చాలా అనుబంధం ఉన్నట్లుగా అనిపిస్తోందన్నారు రాహుల్ గాంధీ. తమిళం మీదా.. తమిళనాడు ప్రజల మీద ఉన్నట్లుండి అంతగా ప్రేమ పొంగటానికి కారణం ఏమై ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. తమిళనాడు కాంగ్రెస్ నేతలు మాత్రం రాహుల్ మాటలకు మురిసిపోతున్నారు. ఆయన మాటల నేపథ్యంలో.. తమిళనాడుకు ఆయన రాకపోకలు ఎక్కువగా ఉండటం కానీ.. తమిళనాడు ప్రాంత నేతలకు ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
ఇదిలాఉంటే.. లేటు వయసులో ఘాటు ప్రేమ మాదిరిగా.. ఈ వయసులో రాహుల్ పురాణ పుస్తకాల మీద ఉన్నట్లుండి ప్రేమ పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా.. తానిప్పుడు ఉపనిషత్తులు.. భగవద్గీతలను తాను స్వయం చదవటం మొదలు పెట్టినట్లుగా చెబుతున్నారు. ఉన్నట్లుండి ఎందుకీ ప్రేమ అంటే.. రాజకీయ అవసరం తోనే. ఈ మధ్యన చెలరేగిపోతున్న మోడీకి చెక్ చెప్పాలంటే ఉపనిష్తులు సారాంశాన్ని అవసరానికి తగ్గట్లుగా కోట్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించారట. అందుకే.. ఉపనిషత్తులు.. భగవద్గీతను ఆయన చదువుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
సంఘ్ పరివారం.. బీజేపీ నేతలతో తలపడేందుకు పురాణ గ్రంధాల మీద పట్టు అవసరమని.. అప్పుడే రాజకీయ ప్రత్యుర్థులపైన పట్టు సాధించొచ్చని రాహుల్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉపనిషత్తుల్లో ప్రజలంతా సమామనమని చెబుతున్నా.. సంఘ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. కొందరిని తొక్కేస్తున్నట్లుగా ఆరోపించారు. మొత్తానికి తానింత కాలం నడిచిన బాటకు భిన్నంగా.. రాహుల్ జీవితంలోకి తమిళం.. పురాణ గ్రంథాలు వగైరా.. వగైరా వచ్చినట్లు కనిపిస్తున్నాయి. మరి.. తాజా మార్పు యువరాజా వారిని ఎక్కడికి తీసుకెళుతుందో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/