చేసుకున్నోడికి చేసుకున్నంత అని ఊరికే అనలేదు. మైలేజీ మోజులో పడిపోయి తాను ఏం చేస్తున్నాను? ఏ విషయానికి తాను సంఘీభావాన్ని పలుకుతున్నాను? అన్న విషయాన్ని మర్చిపోయి అడ్డంగా బుక్ అయిపోయారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. జేఎన్ యూలో ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ సభను నిర్వహించిన విద్యార్థిని వెనకేసుకొచ్చిన రాహుల్ వైఖరిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో మరెవరూ లేనట్లు.. సంస్మరణ జరుపుకోవటానికి దేశాన్ని అస్థిరపరిచిన ఒక దుర్మార్గుడే దొరికాడా? అన్నది సగటు జీవి ప్రశ్న.
మేధావులు.. ప్రపంచ పౌరులు (తమకు దేశ సరిహద్దులనేవే ఉండవంటూ చెప్పుకునే బుద్ధిజీవులు) కొందరు అఫ్జల్ గురు సంస్మరణ సభ నిర్వహణ గురించి లాజిక్కులు తీసి అర్థం లేని వాదనలు చాలానే చేస్తారు. జాతీయవాదం అంటే అసలేంటో తెలుసా? అంటూ క్లాస్ పీకే ప్రయత్నం చేస్తారు. ఇలా మాట్లాడే వారందరి ప్రాణాల్ని రక్షించటానికి మరోవైపు సరిహద్దుల దగ్గర.. దేశం లోపల ఎంతోమంది పోలీసులు.. రక్షణ సిబ్బంది తమ ప్రాణాల్ని పణంగా పెడతారు.
తమ ఉన్మాదంతో అమాయకుల ప్రాణాలు తీసే తీవ్రవాదులకు ఉరిశిక్ష లాంటివి అస్సలు వద్దని.. ప్రాణం ఎంత విలువైనదో తెలుసా అంటూ విచిత్రమైన వాదనను వినిపిస్తుంటారు. ఇలాంటి వారు.. ఉగ్రవాదుల కారణంగా నష్టపోయిన కుటుంబాల గురించి.. వారి ఆవేదన గురించి లోకానికి ఏమైనా చెబుతారా? అంటే ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడరు. మరీ.. బలవంతంగా అడిగితే.. తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తామని చెబుతారు. ఉగ్రవాదుల గురించి రోడ్ల మీదకు వచ్చే వారంతా.. అదే ఉగ్రవాదుల కారణంగా దారుణమైన నష్టానికి గురైనప్పుడు మాత్రం గొంతెత్తరు.
అలాంటి వైఖరి కొందరి బుద్ధి జీవులకు సరిపోయినా రాజకీయ పార్టీలకు.. అందునా కాంగ్రెస్ లాంటి పార్టీకి అస్సలు చెల్లదు. కానీ.. ఎలా పడిందో కానీ సోకాల్డ్ బుద్ధి జీవుల ప్రభావం రాహుల్ బాబు మీద పడింది. ఆయన ఏకంగా జేఎన్ యూ వర్సిటీలో అఫ్జల్ గురు సంస్మరణ సభ నిర్వహించిన వారికి మద్దుతు పలకటంతో ఒక్కసారిగా ఆయన్ను వేలెత్తి చూపించే వాళ్లు కోట్లల్లో చేరిపోయారు.
ఇదే అవకాశంగా భావించిన అధికార బీజేపీ నేతలు రాహుల్ ఇమేజ్ ను భారీగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేసి.. సక్సెస్ అయ్యారు. దీంతో రాహుల్ గాంధీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే.. తన దేశభక్తి గురించి ఆయన వివరంగా చెప్పుకోవాల్సి వచ్చింది. తనకున్న జాతీయభావం.. తన కుటుంబం చేసిన త్యాగాల గురించి అందరికి తెలుసంటూ తాతల గొప్పల్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా చూసినప్పుడు.. ఎందుకిలా జరిగిందన్న ప్రశ్న వేసుకుంటే.. రాహుల్ స్వయంకృతాపరాధం అనిపించక మానదు. రాజకీయ ప్రయోజనం కోసం దూకుడుతనం ఉండటంలో తప్పు లేదు కానీ.. అదే మొత్తంగా మారితే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయి సుమా.