రాఫేల్ యుద్ద విమానాల తయారీ ఎపిసోడ్ మరోమారు మాట్ టాపిక్ గా మారింది. ఇవాళ లోక్ సభలో రాఫేల్ అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీ వర్సెస్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నట్లుగా ఎపిసోడ్ జరిగింది. రాఫేల్ తయారీ బాధ్యతలను అనిల్ అంబానీ సంస్థకు ఎవరు కట్టబెట్టారని ప్రశ్నించారు. రాఫేల్ ధర అంశం రహస్య ఒప్పందంలో లేదని - యుద్ధ విమానాల కాంట్రాక్టులోకి అనిల్ అంబానీని ఎవరు తీసుకువచ్చారని - ఈ డీల్ లోకి అనిల్ అంబానీ ఎలా వచ్చారని ఆయన అడిగారు. రక్షణ మంత్రి సీతారామన్ రెండు గంటల పాటు మాట్లాడారని - కానీ ఏఏ(అనిల్ అంబానీ)కి కాంట్రాక్టు ఎవరు అప్పగించారన్న విషయాన్ని వెల్లడించలేదని రాహుల్ అన్నారు. రక్షణ మంత్రి సీతారామన్ నో లేక మాజీ మంత్రి మనోహర్ పారికర్ నో నిందించడం లేదని - రాఫేల్ డీల్ కుంభకోణంలో ప్రధాని పాత్ర ఉందన్న ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని రాహుల్ తెలిపారు. అంబానీ పేరును భారత ప్రభుత్వం - ప్రధాని మోదీయే సూచించారని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే వెల్లడించినట్లు రాహుల్ అన్నారు. భోఫోర్స్ కుంభకోణం కాంగ్రెస్ ను పాతాలానికి నెట్టి వేసిందని - కానీ రాఫేల్ డీల్ ప్రధాని మోదీని మళ్లీ అధికారంలోకి తెస్తుందని సీతారామన్ అన్నారు. దళారీలు లేకుండానే రక్షణ మంత్రిత్వశాఖ నడుస్తోందని ఆమె అన్నారు. రాఫేల్ కొనుగోలు విషయంలో తాము సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించలేదని సీతారామన్ స్పష్టం చేశారు.
అనంతరం కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతా రామన్ ఘాటుగా వివరణ ఇచ్చారు. బీజేపీకి జాతీయ భద్రతే ముఖ్యమని ఆమె చెప్పారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటామని ఆమె తేల్చి చెప్పారు. పొరుగుదేశాలు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతుంటే చూస్తూ కూర్చోమని ఆమె ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్ - చైనాలు రక్షణ సంబంధ అంశాల్లో దూకుడుగా దూసుకపోతుంటే - అప్పటి యూపీఏ ప్రభుత్వ కేవలం 18 రఫేల్ యుధ్ధ విమానాల కొనుగోలుకు ప్రయత్నించిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి సంఖ్యను 36కు పెంచామని ఆమె చెప్పారు. యూపీఏ హాయంలో లాగా తమకు 10 ఏళ్లు పట్టలేదని కేవలం 14 నెలల వ్యవధిలోనే ఒప్పందాన్ని పూర్తి చేశామని ఆమె తెలిపారు. 2016 సెప్టెంబర్ 23 నాటి ఒప్పందం మేరకు భారత్ కొనుగోలు చేసిన తొలి రఫేల్ యుధ్ధ విమానం సెప్టెంబర్ లో ఇండియాకు వస్తుందని - మిగిలిన విమానాలు 2022కి అందుబాటులోకి వస్తాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. రఫేల్ విమానాల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని - అంబానీల కొసమే రాఫెల్ కొనుగోలు చేశామని కాంగ్రెస్ భావిస్తే - ఖత్రోచి - రాబర్ట్ వాద్రాల కోసమే యూపీఏ హయాంలో రాఫెల్ ఒప్పందాలు జరిగాయని ఆమె ఆరోపించారు. మేము చెప్పేమాటలు వినటానికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓపిక లేదని ఎందుకంటే వారికి నిజాలు వినటం ఇష్టం లేదని ఆమె అన్నారు. దేశంలో యుధ్దవిమానాల తయారీ హెచ్ఏఎల్ ను కాదని విదేశాలకు ఎందుకిచ్చారని ? ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.... హెచ్ ఎఎల్ పనితనం విషయమే కాదు - లోపాలు కూడా రాహుల్ తెలుసుకోవాలని ....తేజస్ విషయంలో హెచ్ ఎఎల్ పనితనంలో వెనుక బడిందని - 43 ఆర్డర్ ఇస్తే - 8 విమానాలు మాత్రమే సమకూర్చారని ఆమె వివరించారు.
భారత్ చుట్టు ఉన్న వాతావరణం అత్యంత సున్నితంగా ఉందని - భారత్ శాంతిని కాంక్షిస్తుందని - కానీ సైనిక దళాలు నిరంతం అప్రమత్తం ఉండాల్సిన పరిస్థితి ఉందని - సరైన సమయంలో ఆయుధాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని సీతారామన్ తెలిపారు. 2004 నుంచి 2015 వరకు చైనా సుమారు 400 విమానాలను తన అమ్ములపొదిలో చేర్చుకుందని - పాకిస్థాన్ కూడా తన వైమానిక దళాన్ని రెండింతలు చేసిందని - ప్రస్తుతం భారత్ లో కేవలం 32 స్క్వాడ్రన్ ల బలం మాత్రమే ఉందని మంత్రి తెలిపారు. ఆయుధాల అవసరాన్ని గుర్తించాల్సిన సందర్భం ఆసన్నమైందన్నారు. 36వ రాఫేల్ 2022లో డెలివరీ అవుతుందని మంత్రి చెప్పారు. రక్షణ వ్యవస్థను - రక్షణ వ్యవహారాలను చూడాల్సిన తీరు భిన్నంగా ఉంటుందన్నారు. హెచ్ ఏఎల్ పై మొసలి కన్నీరు ధారపోయాల్సిన అవసరం లేదని - వాళ్లకు కాంట్రాక్టు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా - ఆ డీల్ ను కుదుర్చుకోలేకపోయారని మంత్రి ఆరోపించారు.
Full View