అక్క‌డికి బైక్ మీద వెళ్లిన రాహుల్‌

Update: 2017-06-08 09:41 GMT
కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్ గాంధీ సాహ‌సానికి తెర తీశారు. రైతుల ఆందోళ‌న‌తో హింసాత్మ‌కంగా మారిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని మాంద‌సౌర్ ప్రాంతంలో అన్న‌దాత‌ల్ని క‌లుసుకునేందుకు ఆయ‌న ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రియాక్ట్ అయ్యారు. గ‌డిచిన కొద్దిరోజులుగా తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న మాంద‌సౌర్ ప్రాంతానికి వెళ్లేందుకు ఆయ‌న బైక్ మీద ప్ర‌యాణించేందుకు రెఢీ అయ్యారు.

నిత్యం క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ట్రంలో ఉండే రాహుల్ గాంధీ.. పోలీసుల నుంచి తెలివిగా త‌ప్పించుకొని.. ఆందోళ‌న చేస్తున్న రైతుల్ని క‌లిసేందుకు ఆయ‌న బైక్ మీద వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. ఆ విష‌యాన్ని తెలుసుకున్న పోలీసులు.. రాహుల్‌ ను బైక్ మీద మాంద‌సౌర్ కు వెళ్ల‌కుండా అడ్డుకున్నారు.

తాను మాంద‌సౌర్‌ కు వెళ్లాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటే.. పోలీసులు త‌న‌ను అడ్డుకునేందుకు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా రాహుల్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట‌ర్ ద్వారా ట్వీట్ చేయ‌టం గ‌మ‌నార్హం.

మాంద‌సౌర్ కు 180 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న వేళ రాహుల్ తాను ప్ర‌యాణిస్తున్న వాహ‌నం మీద నుంచి దిగి మ‌రో వాహ‌నం మీద రాహుల్ బ‌య‌లుదేరారు. కాంగ్రెస్ యువ‌రాజుతో పాటు.. రాజ‌స్థాన్ కాంగ్రెస్ చీఫ్ స‌చిన్ పైలెట్ సైతం మ‌రో బైక్ మీద వెళ్లారు. అయితే.. రైతులు ఆందోళ‌న చేస్తున్న‌ ప్రాంతానికి రాహుల్‌ ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అనుమ‌తించేది లేద‌న్న విష‌యాన్ని పోలీసులు తెగేసి చెప్పారు. మాంద‌సౌర్ స‌రిహ‌ద్దుల్లో దాదాపు 700ల‌కు పైగా పోలీసులు ప‌హ‌రాకాస్తున్నాయి. బ‌య‌ట వారిని ఎవ‌రిని గ్రామంలోకి వెళ్ల‌నీయ‌కూడ‌ద‌న్న ల‌క్ష్యంతో  వారు ఉన్న‌ట్లు చెబుత‌న్నారు.

ఇదిలా ఉండ‌గా.. మాంద‌సౌర్‌ కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించిన రాహుల్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న్ను అక్క‌డ ఉంచి బ‌స్సులో త‌ర‌లించిన‌ట్లుగా చెబుతున్నారు. మొత్తానికి అన్న‌దాత‌లు ఆందోళ‌న చేస్తున్న ప్రాంతానికి చేరుకొని వారి బాధ‌ల్ని నేరుగా తెలుసుకోవాల‌నుకున్న రాహుల్ లక్ష్యం నెర‌వేర‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News