కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో బాగా రాటుదేలారు. బీజేపీ నేతల ఎదురుదాడిని తిప్పికొట్టడమే కాకుండా వారే డిఫెన్సులో పడేలా మాట్లాడడంలో ఆరితేరుతున్నారు. తాజాగా ఆయన వేసిన ఓ కౌంటర్ కు ఎలా సమాధానమివ్వాలో తెలియక బీజేపీ నేతలు సైలెంటయిపోతున్నారు. రాహుల్ గాంధీ ఆలయాలను దర్శిస్తున్న సంగతి తెలిసిందే.. దీనిపై బీజేపే నేతలు విమర్శలు చేస్తున్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అనేక ఆలయాలను దర్శించారు. అక్షర్ ధామ్ ఆలయంతో పాటు ఆంబాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. రోడ్ షో లో భాగంగా దగ్గరలో ఉన్న ఆలయాలను రాహుల్ తప్పకుండా దర్శిస్తున్నారు. సోమవారం నాడు రాహుల్ గాంధీ మెహసానాలో బాహుచరాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనిపై బీజేపీ నేతలు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. ఇదంతా రాహుల్ ఎన్నికల గిమ్మిక్కని వారంటున్నారు. అయితే... వారి విమర్శలకు రాహుల్ ధీటుగా సమాధానమిచ్చారు. తాను శివ భక్తుడిననని చెప్పారు.. తాను ఆలయాలను దర్శిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఆధ్యాత్మికం ఏ ఒక్కరి సొత్తో కాదని అన్నారు.
రాహుల్ వరుసగా ఆలయాలు దర్శిస్తుండడంతో ఎన్నికల స్టంట్ అంటూ బీజేపీ నేతలు దాడి చేస్తున్నారు. ఆలయాలను దర్శించడం అక్కడ ప్రార్ధనలు చేయడం భారతీయ సంస్కృతిలో భాగమని అలా చేయడం మంచిదేనని... కానీ, ఎన్నికల సమయంలోనే రాహుల్ కు ఎందుకు ఆలయాలు గుర్తుకొస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. భక్తి మనసులో ఉండాలే కానీ ఎన్నికల్లో ఉండరాదని బీజేపీ జాతీయ కార్యదర్శి భూపేందర్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.
అయితే... ఈ విమర్శలను రాహుల్ గట్టిగానే తిప్పి కొడుతున్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి బిజెపి ప్రత్యేకంగా కొందరిని నియమించిందని వారు తనపై విష ప్రచారం చేస్తున్నారని రాహుల్ తెలిపారు. గుజరాత్ ప్రజలకు నిజానిజాలు తెలుసని అన్నారు. తాము గుజరాత్‌లో అధికారంలోకి వస్తే ప్రజల మన్ కీ బాత్ వింటామని….వారి మనోభావాలకు అనుగుణంగా పాలన ఉంటుదని చెబుతూ మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంపై ఆయన విమర్శలు చేశారు.