కాంగ్రెస్ నాయకుల గురించి రాజకీయవర్గాల్లో ఓ చిత్రమైన అభిప్రాయం ఉంటుంది. అదేంటంటే...అధికారం తమ హక్కు భుక్తం అనే భావనతో హస్తం పార్టీ నేతలు ఉంటారని - అలాంటి ఆలోచనల తీరును వారు తరతరాలుగా కలిగి ఉన్నారనేది సదరు వర్గాల ఆరోపణ. ఇది నిజం కాదని కాంగ్రెస్ వర్గాలు కొట్టివేస్తున్నప్పటికీ అవుననే రీతిలో పలు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు నిదర్శనం...వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు మెజారిటీ వస్తే తాను ప్రధాని పదవి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని రాహుల్ కొంతకాలం క్రితం ప్రకటించారు. గత ఎన్నికల తరువాత ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ సరిగా కోలుకోలేనప్పటికీ...రాహుల్ ఈ ప్రకటన చేసిన నేపథ్యంలో...తమ విశ్లేషణలో తప్పేం లేదని సదరు వర్గాలు ఎద్దేవా చేశాయి.
ఇదే నిజమనేలా చేస్తూ తాజాగా ఇంకో సంఘటన జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముంబైలోని భీవండీ కోర్టుకు హాజరయ్యారు. మహాత్మా గాంధీ హత్యవెనుక ఆర్ ఎస్ ఎస్ హస్తం ఉందంటూ గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు కావడంతో రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. ఆర్ ఎస్ ఎస్ వేసిన పరువునష్టం కేసులో రాహుల్ కోర్టుకు హాజరవుతుంటే..కాంగ్రెస్ నేతలు మాత్రం ఓ చిత్రమైన చర్యకు దిగారు. అదేంటంటే... ముంబై విమానాశ్రయం నుంచి కోర్టుకు చేరుకునే మార్గంలో 'భవిష్యత్తు ప్రధానమంత్రి' అనే భారీ హోర్డింగులు ఏర్పాటు చేసి ఘనంగా స్వాగతం పలికారు! రాహుల్ పార్టీ బహిరంగ సభకో లేదా...కనీసం కార్యక్రమానికో కాకుండా..కోర్టు కేసుకు హాజరవుతున్న సమయంలో ఇలాంటి ఫ్లెక్సీలు వేయడం పలువురిని ఆశ్చర్యంలో పడేసింది. ఈ హోర్డింగ్ లు ఏర్పాటు చేసింది కూడా ఎవరో చోటా మోటా నాయకులు అనుకోకండి...కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అశోక్ చవాన్ - ముంబయి నగర అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ - నేతలు జనార్ధన్ చందూర్కర్ - భాయ్ జగతప్ - రాజు వాగ్మారె తదితర సీనియర్ నేతలు హోర్డింగులు ఏర్పాటు చేయించారు.
వచ్చే ఎన్నికలకు దాదాపు ఏడాది సమయం ఉండటం - ఏ పార్టీ విజయం సాధిస్తుందనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాని సమయంలో... బీజేపీ బలహీనం అవుతున్నప్పటికీ అధికారానికి కాంగ్రెస్ ఇంకా పూర్తిగా బలోపేతం కాని ప్రస్తుత సందర్భంలో...ఇలా కాబోయే ప్రధాని అంటూ ఫ్లెక్సీలు వేయించుకోవడం దానికి రాహుల్ గాంధీ సైతం నో చెప్పకపోవడం కాంగ్రెస్ నాయకులకే చెల్లిందంటున్నారు.