రాహుల్‌ కూ టైమొచ్చిందిగా!

Update: 2017-08-31 08:09 GMT
రాహుల్ గాంధీ... గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ కు మొన్న‌టిదాకా ఆయ‌న నిజంగానే యువ‌రాజు కింద లెక్క‌. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఈ యువ‌రాజు... మోదీ హ‌వా ముందు బొక్క బోర్లా ప‌డిపోయారు. అయితే అప్ప‌టికే కాంగ్రెస్ పాల‌న‌లో ప‌దేళ్ల పాటు ఉన్న ప్ర‌జ‌లు ఈసారి మార్పు కొరుకున్నార‌ని, మ‌రో ఐదేళ్ల త‌ర్వాత అయినా రాహుల్ ప్ర‌ధాని పీఠం ఎక్క‌డం ఖాయ‌మేన‌ని నాడు హ‌స్తం పార్టీ నేత‌లు చెప్పుకొచ్చారు. అయితే ఆ త‌ర్వాత వ‌రుస‌గా చోటుచేసుకున్న ప‌రిణామాల‌తో రాహుల్‌ కు అంత సీన్ లేద‌ని తేలిపోయింది. యువ‌రాజంటే రోజు రోజుకు రాటు  దేలాలి గానీ.. రాహుల్ మాత్రం నానాటికీ జావ‌గారిపోతున్నార‌న్న వాద‌న వినిపించింది.

ఈ క్రమంలో రాహుల్ నాయ‌క‌త్వంలో 2019 ఎన్నిక‌ల‌కు వెళితే... 2014లో వ‌చ్చిన‌న్ని సీట్లు కూడా రావ‌ని తేలిపోయింది. ఈ విష‌యం రాహుల్ త‌ల్లి - కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా గ్ర‌హించిన‌ట్లుగా వార్తా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. దీంతో వ‌చ్చే సారి అయినా త‌న ప్ర‌తాపం చూపాలంటే రాహుల్‌ కు ప్ర‌త్యామ్నాయం వెత‌కాల్సిందేనన్న భావ‌న‌తో సోనియా... త‌న కూతురు ప్రియాంకా గాంధీ పేరును తెర మీదకు తెచ్చారు. దీంతో షాక్ తిన్న రాహుల్‌... ఇప్పుడ‌స్స‌లు మీడియాకే క‌నిపించ‌డం మానేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే... కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన‌ప్పుడ‌ల్లా... బీజేపీ నేత‌లు రాహుల్ ప్ర‌స్తావ‌న లేనిదే త‌మ మీడియా స‌మావేశాలు ముగించ‌డం లేదు. ప్ర‌ధాని మోదీ అయితే మ‌రీనూ.. రాహుల్‌ ను దెప్పి పొడ‌వందే ఆయ‌న కాంగ్రెస్ పార్టీపై విమ‌ర్శ‌ల‌ను ఆప‌డం లేదు. దీంతో త‌న ప్ర‌మేయం లేకుండానే రాహుల్ గాంధీ వైరి వ‌ర్గాల‌కు టార్గెట్‌ గా మారిపోయారు.

అయితే ప్ర‌తి ఒక్క‌రికి ఎప్పుడో అప్పుడు అవ‌కాశం రాక మాన‌దు అన్న నానుడి నిజ‌మే అయిన‌ట్లుంది. ఇప్పుడు రాహుల్ వంతు వ‌చ్చింది. పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల ఒన‌గూడిన ప్ర‌యోజ‌నం ఏమీ లేద‌న్న నివేదిక‌ను రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ‌య‌ట‌పెట్టిన మ‌రుక్ష‌ణ‌మే రంగంలోకి దిగేసిన రాహుల్‌... త‌న‌పై విమ‌ర్శ‌లు సంధిస్తున్న బీజేపీ నేత‌లు, ప్ర‌త్యేకించి ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేసుకుని నేటి ఉద‌యం త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో త‌న‌దైన స్టైల్లో చెల‌రేగిపోయారు. చేసింది ఒకే ఒక్క ట్వీట్ అయినా కూడా మోదీకి దిమ్మ తిరిగేలా రాహుల్ సూటిగా విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టార‌న్న వాద‌న వినిపిస్తోంది.

అయినా స‌ద‌రు ట్వీట్ లో మోదీని రాహుల్ ఎలా ఆడుకున్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *పెద్ద నోట్ల ర‌ద్దు ఘోర త‌ప్పిద‌మే. దీని ఫ‌లితంగా పేద‌లు నానా అవ‌స్థ‌లు ఎదుర్కొన్నారు., ఆర్థిక వ్య‌వ‌స్థ కూనారిల్లింది. పీఎంజీ ఈ త‌ప్పు మీదేన‌ని ఒప్పుకుంటారా?* అంటూ రాహుల్ కాస్తంత ఘాటుగానే అయినా... త‌న‌దైన శైలిలో మోదీకి ప్ర‌శ్నాస్త్రాలు సంధించారు. మ‌రి రాహుల్ ట్వీట్‌ పై మోదీ ఏమంటారో చూడాలి.  


Tags:    

Similar News