చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నిరాశే ఎదురైంది. అపోలో గ్రూప్ సంస్థల చైర్మన్ ప్రతాప్ రెడ్డి స్వయంగా రాహుల్ కు స్వాగతం పలికి లోపలికి తీసుకు వెళ్లినా, ఆయన్ను జయలలిత వద్దకు మాత్రం తీసుకెళ్లలేదట. అందుకు అధికారులు అంగీకరించకపోవడంతో ఆమెను రాహుల్ స్వయంగా పరామర్శించలేకపోయారు.
జయను చూసేందుకు వీల్లేదని అధికారులు తెగేసి చెప్పడంతో రాహుల్ ఏమీ చేయలేకపోయారు. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను - ప్రతాపరెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు మీడియాకు చెప్పిన రాహుల్ ఆపై అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే... జయ కోలుకుంటున్నప్పటికీ చికిత్స ఇప్పుడే పూర్తికాదని... సుదీర్ఘకాలం చికిత్స అవసరమని, అది ఎన్నాళ్లపాటు అనేది అప్పుడే చెప్పలేమని వైద్యులు రాహుల్ కు వివరించినట్లు తెలుస్తోంది.
జాతీయ పార్టీ కాంగ్రెస్ ముఖ్య నేత అయిన రాహుల్ కే అమ్మ దర్శనం దొరకలేదన్న సమాచారం పొక్కడంతో బయట పడిగాపులు కాస్తున్న జయ అభిమానుల్లో ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. కాగా అపోలో ఆసుపత్రి వద్ద వందలాది మంది జయ అభిమానులు పోగవుతుండడంతో భద్రత మరింత పెంచారు. తమిళనాడు వ్యాప్తంగా జయ అభిమానులు ఆమె ఆరోగ్యం కోసం పూజలు చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/