తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ రూపురేఖల్ని మార్చేస్తున్నట్లుగా గొప్పలు చెబుతుంటారు కమలనాథులు.మోడీ హయాంలో దేశ ప్రజల బతుకులు భారీగా మార్పులు చెందినట్లు కోతలు కోస్తుంటారు.అనూహ్యంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో.. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వలస కార్మికులు మండే ఎండలో కాలిబాటన సొంతూళ్లకు పయనమైన వైనం కన్నీళ్లను తెప్పించింది.
చేతిలో ఎంత అధికారం ఉంటే మాత్రం.. దాంతో ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. వేదనల్ని.. వెతల్ని మిగిల్చేలా మోడీ ప్రభుత్వ హయాంలో ఉందన్న విమర్శ వినిపిస్తోంది. లాక్ డౌన్ వేళ.. ఒక పద్దతి ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న వలసకార్మికుల్ని వారిస్వస్థలాలకు చేర్చి ఉంటే.. ఈ రోజున ఉన్నన్ని కేసులు ఉండేవి కావన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
వలసకార్మికుల్ని వారి స్వస్థలాలకు చేర్చే విషయంలో కేంద్ర రైల్వే శాఖ ఫిక్స్ చేసిన ధరలు.. రాష్ట్ర ప్రభుత్వాలు తాము చెప్పిన మొత్తాన్ని కట్టేసిన తర్వాతనే రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లుగా విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని రైల్వే శాఖ వెల్లడించింది. మే ఒకటి నుంచి నడిపిన శ్రామిక్ రైళ్ల ద్వారా రూ.360 కోట్ల మొత్తం రైల్వేలకు వచ్చినట్లు చెప్పారు. ఒక్కో వలసకార్మికుడ్ని వారిస్వస్థలాలకు చేర్చేందుకు సగటున రూ.600 ఖర్చు అయినట్లు చెప్పారు.
శ్రామిక్ రైళ్ల ద్వారా ఇప్పటివరకూ తాము అరవై లక్షల మందిని వారి స్వస్థలాలకు చేర్చినట్లు చెబుతున్నారు. కార్మికుల్ని తరలించటానికి అయ్యే ఖర్చులో తాము కేవలం పదిహేను శాతం మొత్తాన్ని మాత్రమే తీసుకున్నట్లు చెప్పారు. లక్షలాది మంది కన్నీళ్లతో వచ్చే రూ.360 కోట్ల ఆదాయం వస్తే ఏమిటి? రాకుండే ఏమిటి? వలస కార్మికుల్ని ఇళ్లకు చేర్చే విషయంలో అమితమైన ఆలస్యాన్ని ప్రదర్శించిన మోడీ సర్కారు.. ఇప్పటికే పలు విమర్శల్ని మూట కట్టుకుంది. వారి ద్వారా వచ్చిన ఆదాయం గురించి రైల్వేలు ప్రకటించిన లెక్కలు పుండు మీద కారం జల్లినట్లేనన్న వాదన వినిపిస్తోంది.