రేవంత్‌ కు షాక్‌.. టీఆర్ఎస్‌ లో చేరిన ముఖ్య నేత‌

Update: 2018-12-04 09:34 GMT
తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌రో షాక్ త‌గిలింది. ఓ వైపు పోలింగ్ గ‌డువు స‌మీపిస్తున్న త‌రుణంలో ఆయ‌న‌కు ముఖ్య‌నేత ఒక‌రు గుడ్ బై చెప్పారు. రేవంత్ అనుచ‌రుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌ రాజారామ్ యాదవ్ అనే టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఉన్నాడు. ఇవాళ ఎంపీ కవిత ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు. ఈసందర్భంగా కవిత.. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్నాడు.

తెలంగాణ ఉద్య‌మంలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ త‌ర‌ఫున‌ కీల‌క పాత్ర పోషించారు. అనంత‌రం విద్యార్థి నాయకుడిగా టీడీపీలో చేరి త‌దుప‌రి రేవంత్ రెడ్డితో క‌లిసి కాంగ్రెస్‌లో చేరారు. అయితే, ఆయ‌న‌కు ద‌క్క‌లేదు. టీడీపీతో కాంగ్రెస్ జతకట్టినప్పటినుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. తాజ‌గా ఎంపీ కవిత సమక్షంలో రాజారామ్ యాదవ్ టీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఇవాళ ఈ సందర్భంగా రాజారామ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ... ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులకు మహాకూటమి తీవ్ర అన్యాయం చేసిందని రాజారామ్ యాదవ్ మండిపడ్డారు.

తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష. తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ కీలకపాత్ర వహిస్తున్నారు. సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటించలేదు. ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన పిడమర్తి రవి, స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్ కు కేసీఆర్ సముచిత స్థానం కల్పించారు. యాదవులకు 5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యాదవులను గుర్తించడం లేదన్నారు.


Tags:    

Similar News