ప్రస్తుతం తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ లో ర్యాలీల పై రాజకీయ నేతలు , పోలిసుల మధ్య వార్ నడుస్తుంది. డిసెంబర్ 28న ర్యాలీలు, సభలు నిర్వహించుకుంటామని ప్రధాన రాజకీయ పార్టీ లైన బీజేపీ, ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పోలీసుల అనుమతి కోరాయి. అయితే రెండు పార్టీల అభ్యర్థనని పోలీసులు తిరస్కరించారు. నగరం లో శాంతి భద్రతలు, ప్రజా రవాణాకి సమస్యలు ఏర్పడతాయి అని చెప్పి అనుమతి నిరాకరించారు. దీనితో ఈ వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. టీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా వున్న ఎంఐఎం పార్టీ ఎక్కడ సభ పెట్టుకోవాలన్నా కూడా విపరీతమైన రద్దీ లో కూడా పోలీసులు వారికీ అనుమతి ఇస్తున్నారు. కానీ , కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ కి, ప్రతిపక్ష పార్టీగా వున్న కాంగ్రెస్ పార్టీలకు మాత్రం ర్యాలీలు , సభలు నిర్వహించుకోవడానికి అనుమతివ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంఐఎం పార్టీ ఇప్పటికే సీసీఏ కి వ్యతిరేకం గా రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించింది.
ఈ నేపథ్యం లోనే దేశ వ్యాప్తం గా రగులుతున్న ఎన్నార్సీ, సీఏఏ అంశాలపై సేవ్ కాన్స్టిట్యూషన్ పేరిట హైదరాబాద్ లో బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అదే సమయం లో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గరి ఎన్టీఆర్ స్టేడియంలో సీఏఏ అనుకూల సభకు బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పోలిసుల అనుమతి అడిగారు. దీనితో పోటా పోటీగా సభలను నిర్వహించేందుకు సిద్దమైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలకు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇద్దరి లో ఎవరికీ కూడా అనుమతి ఇవ్వలేదు. పోలిసుల నిర్ణయం పై ఉత్తమ్ , అలాగే రాజాసింగ్ మండిపడ్డారు. 28 న కాక పోతే 30 న ఇందిరాపార్క్ వద్ద సీఏఏ అనుకూల సభ నిర్వహిస్తామని రాజాసింగ్ ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ చర్య ను సమర్థిస్తూ సభ నిర్వహిస్తే దాన్ని పోలీసులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారాయన. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ పోలీసుల పై మండి పడ్డారు. ఆర్.ఎస్.ఎస్.కు భారీ ర్యాలీ కి అనుమతించిన పోలీసులు, తమకెందుకు అనుమతినివ్వరిన ఫైర్ అయ్యారు. నగరం లో ఎదో ఓ మూలన అనుమతించినా సేవ్ కాన్స్టిట్యూషన్ పేరిట సభ నిర్వహించుకుంటామని కోరారు.తాజాగా మరోసారి ర్యాలీకి అనుమతివ్వాలని కోరుతూ మరో అప్లికేషన్ పెట్టారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క .