వైరస్ సోకిన మంత్రులు గాంధీలో చేరాలి ..రాజాసింగ్ !

Update: 2020-06-30 10:30 GMT
తెలంగాణలో మహమ్మారి కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజల నుండి ప్రముఖులు , ప్రజాప్రతినిధులు ఇలా ప్రతి ఒక్కరు ఈ వైరస్ భారిన పడ్డారు. తెలంగాణలో ఇప్పటికే హోంమంత్రి తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు వైరస్ భారిన పడ్డారు. అయితే , వారందరు ప్రభుత్వ ఆసుపత్రి అయిన గాంధీ లో కాకుండా ..ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ బాధితులందరికీ గాంధీ హాస్పిటల్‌ లో చికిత్స అందిస్తామని గతం లో కేసీఆర్  చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ వైరస్ భారిన పడిన మంత్రులందరూ గాంధీ లో చేరాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేసారు.
 
తెలంగాణ లో ఎంత మందికి  వైరస్ సోకినా  గాంధీ ఆస్పత్రే దిక్కుగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న హోం మంత్రి మహమూద్ అలీ కి , నేడు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు కరోనా వచ్చింది..  వైరస్ పాజిటివ్ వచ్చిన వాళ్లందరికీ ప్రభుత్వ ఆస్పత్రి లోనే ట్రీట్మెంట్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పారు.. ప్రైవేట్ ఆసుపత్రి లో చేయించమని చెప్పారు.. మరి మీ హోం మంత్రి మహమూద్ అలీ కి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి ఎలా చికిత్స తీసుకుంటున్నారు? అంటే మన రాష్ట్రం లోని ప్రభుత్వ ఆసుపత్రుల మీద వాళ్ళకి నమ్మకం లేనట్లే కదా?  అందుకే మీ హోమ్ మంత్రి, మీ ఎమ్మెల్యే లు, యశోద ఆసుపత్రి, లేక పోతే అపోలో ఆసుపత్రి లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.. మీరు ఫాం హౌస్ నుండి లేదా మీ ఇంటి నుంచి ఒకసారి బయటికి రండి, బయటకు వచ్చి ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలించండి, అక్కడ ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి మీకు అర్థమవుతుంది అని రాజా సింగ్. ఇతర రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్ బాగా చూస్తున్నారు. వాళ్లు అన్ని వసతులు కల్పిస్తున్నారు. కానీ తెలంగాణ లో నాలుగు కోట్ల మంది ప్రజలు ఉంటే ఓకే ఒక్క ఆసుపత్రి , గాంధీ మాత్రమే ఉంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చి చూడండి ప్రజలను ఇబ్బంది పెట్టకండి అని కోరారు.
Tags:    

Similar News