వైసీపీలో ఎపుడు ఎవరు సడెన్ గా హడావుడి చేస్తారో తెలియదు, అలాగే ఎపుడు సైలెంట్ గా ఉంటారో కూడా అర్ధం కాదు, విజయనగరం జిల్లాలో చూసుకుంటే కొత్తగా ఏర్పడిన మన్యం జిల్లాలో సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర హడావుడి మామూలుగా లేదు. ఆయనే ఇపుడు కొత్త జిల్లాలో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. కొత్త జిల్లా సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామని భరోసా ఇస్తున్నారు.
మరో వైపు మన్యం జిల్లా కేంద్రంగా పార్వతీపురం ఉంది. దాని పక్కనే కురుపాం ఉంది. ఆ కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన స్థానంలో ఉన్నారు. మన్యం జిల్లా విషయంలో నిజంగా ఏదైనా హడావుడి చేయాలీ అంటే ఆమె ముందుండి చేయాలి. కానీ సీన్ లోకి రాజన్న దొర దూసుకువచ్చేశారు. అయనదే అంతా అన్నట్లుగా అలా యమ జోరు మీద సాగిపోతున్నారు.
మరి పుష్ప శ్రీవాణి ఎందుకు గమ్మున ఉన్నారో అర్ధం కావడం లేదు అంటున్నారు. కొత్త జిల్లాల గురించే కాదు, చాలా కాలంగా ఆమె లో ప్రొఫైల్ లో ఉన్నారు. ఆమె ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కురుపాం కే పరిమితం అవుతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇపుడు కొత్త జిల్లా ఏర్పడ్డాక సర్వం సహా ఆమె అవుతారు. మరో మంత్రి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాకే పరిమితం అవుతారు కాబట్టి చక్రం తిప్పే చాన్స్ ఆమెకు వచ్చింది.
కానీ ఆ స్టీరింగ్ ని అందిపుచ్చుకుంటోంది మాత్రం రాజన్న దొర కావడమే ఇక్కడ విశేషం. మరి పుష్ప శ్రీవాణి కొంత తగ్గడానికి ఆమె చెప్పినట్లుగా కురుపాం ని జిల్లా కేంద్రంగా చేయలేదన్న అసంతృప్తి ఏమైనా కారణమా అన్న చర్చ కూడా ఉంది. మరో వైపు ఆమె పదవికి ముప్పు ఉందని తెలిసే ఇలా సైలెంట్ అయ్యారా అన్నది కూడా చర్చగా ఉందిట.
ఇక రాజన్నదొరకు ఈ దఫా విస్తరణలో పదవి ఖాయమని అంటున్నారు. ఆయన 2009 నుంచి ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ కి భక్తుడు, జగన్ తో పాటే తన రాజకీయం అనుకుని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వారు. అయినా 2019లో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఈసారి మాత్రం కచ్చితంగా ఆయనే మినిస్టర్ అంటున్నారుట. అందుకే కాబోయే మంత్రిగా కొత్త జిల్లాల బరువు బాధ్యతలను ముందే భుజాన వేసుకుని పనిచేస్తున్నారు అంటున్నారు. చూడాలి మరి రాజన్న మంత్రన్న ఎపుడు అవుతారో.