ప్రజాసేవలో ఉన్న వారు ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇక.. పవర్ లో ఉన్న ప్రజాప్రతినిధి అయితే.. ఆ బాధ్యత మరింత పెరుగుతుంది. అయితే.. అలాంటివి ఏ కోశాన లేక.. టన్నుల టన్నుల ఇగోతో వ్యవహరించే ప్రజాప్రతినిధులు తరచూ బుక్ అవుతుంటారు. తాజాగా అలా బుక్ అయిన జాబితాలో చేరారు రాజస్థాన్‌కు చెందిన బీజేపీ మంత్రి ఒకరు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన వేళ.. అందుకు భిన్నంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెర తీయటమే కాదు.. ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టాయి.
మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఉదంతంపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విషయంలో బ్యాలెన్స్ మిస్ అయిన సదరు మంత్రి.. నోరు జారేశారు. నగల దుకాణంలో ఓనర్ ఇంట్లో పని చేసే ఒక వ్యక్తి.. యజమాని కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఉదంతంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు.. ఈ మధ్య కాలంలో రాజస్థాన్ లో అత్యాచార ఉదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. తాజా ఉదంతం చోటు చేసుకోవటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయనకు.. పెద్ద ఎత్తున ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆయన సహనం మిస్ అయ్యారు.
ఇంట్లో జరిగిన అత్యాచారంపై తామేం చేయగలమన్న వ్యాఖ్యను చేయటంతో పాటు.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవటం.. బాధితురాలికి మంచి వైద్యసాయం చేసుకోవటం మినహా.. చేసేదేమీ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అత్యాచార ఉదంతాలు ఎక్కువ అవుతున్నాయంటూ సంధించిన ప్రశ్నకు బ్యాలెన్స్ మిస్ అయిన మంత్రివర్యులు.. రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాళం వేయాలని అనుకుంటున్నారా? ప‌్రతి ఇంటికి పోలీసుల్ని కాపలా పెట్టాలా? అంటూ ప్రశ్నించిన మంత్రివర్యుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలే వస్తాయేమో. ?